ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆమ్ ఆద్మీ పార్టీ సాదాసీదాగా పారదర్శకంగా ఉండే సామాన్యుల పార్టీ అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆదివారం సెప్టెంబర్ 24న హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘సామాన్యుడి సమరభేరి’ సదస్సు ను ఆప్ తెలంగాణ శాఖా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి జిల్లా కన్వీనర్లు, అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జిలు, మండల, గ్రామా కన్వీనర్లు, ఆప్ వాలంటీర్లు దాదాపు 2000 మంది ప్రతినిధులుగా హాజరవుతారన్నారు. ఢిల్లీ శాసన సభ్యులు, ఆప్ దక్షిణ భారత ఇంచార్జ్ సోమనాథ్ భారతి ముఖ్యఅతిథిగా పాల్గొని ‘సామాన్యుడి సమరభేరి’ సదస్సు ప్రారంభించి ప్రసంగిస్తారని అయన తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు సాగె ఈ సదస్సులో ముందుగా ఆప్ పతాక ఆవిష్కరణ, అమర వీరులకు నివాళులు, ప్రారంభ సభ, ప్రతినిధుల సభ ఉంటుందని, వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ఎండి.మజీద్, డా.పుట్ట పాండురంగయ్య, సోలొమన్ రాజ్, అప్ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు లతోకలసి డాక్టర్ దిడ్డి సుధాకర్ ‘సామాన్యుడి సమరభేరి’ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ సరసమైన ఖర్చుతో మెరుగైన జీవనం అందించగల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని, అత్యంత ప్రభావవంతమైన రాజకీయ పార్టీ అని దేశంలోని ప్రజలు తెలుసుకొని వివిధ రాష్ట్రాల్లో అద్భుతమైన విజయాలను అందిస్తున్నారని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ అధికార ప్రతినిధి వినయ్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సోహెల్, నేతలు టి. రాకేష్ సింగ్, జావేద్ షరీఫ్, శ్రీనివాస్ రెడ్డి, ముత్తాహేయిడ్ పాల్గొన్నారు.


