ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకుని, అప్పులపాలై…?

గన్‌తో భార్యా, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి, తానూ ఆత్మహత్య
కలెక్టర్‌ ‌గన్‌మెన్‌ ఆకుల నరేశ్‌ ‌దురాగతం
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం దారుణం జరిగింది. కలెక్టర్‌ ‌వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యాపిల్లలను కాల్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. గన్‌మెన్‌ ‌నరేశ్‌ ‌తన భార్య, ఇద్దరు పిల్లలను చంపిన అనంతరం గన్‌తో తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ ‌వద్ద గన్‌ ‌మెన్‌ ‌గా పని చేస్తున్న ఆకుల నరేష్‌, ‌తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్‌, ‌కుమార్తె హిమశ్రీతో కలిసి చిన్నకోడూర్‌ ‌లోని రామునిపట్లలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం నరేశ్‌ ‌విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. తన  వెంట తెచ్చుకున్న 9 ఎంఎం పిస్టల్‌ ‌తో భార్య, పిల్లలను కాల్చేశాడు.

అనంతరం తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విధులకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న నలుగురిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాలను ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా.? లేక కుటుంబ కలహాలు కారణమా.? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. అయితే ఆయన ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌లో రూ.80 క్షలు పోగొట్టుకుని అప్పులపాలైనట్లుగా, ఆ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఈ గొడవల కారణంగా స్కూలుకు వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకువచ్చిన నరేష్‌.. ఆవేశంగా తన దగ్గర ఉన్న గన్‌ను తీసుకొని మొదటగా పిల్లలను కాల్చి తర్వాత భార్యను.. ఆపై తనకు తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *