షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 09:రూ. 50 కోట్లతో జహంగీర్ పీర్ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూ. 5 కోట్లతో గిరిజన గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించి అభివృద్ధి పనులు చేపడతారని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో కొత్తూరు మండలం హజరత్ జహంగీర్ పీర్ దర్గాలో 50 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయల నిధులతో గిరిజన గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తదితర వక్ఫ్ బోర్డు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ఇచ్చిన దర్గా అభివృద్ధి హామీకి కొంచెం ఆలస్యమైనా అన్ని వర్గాల సంతృప్తితో పనులు ప్రారంభించబోతున్నామని అన్నారు. ముఖ్యంగా 50 కోట్ల రూపాయల నిధులతో 50 ఎకరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దర్గాను ఎంతగానో విశ్వసిస్తారని అన్నారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ దర్శనం చేసుకుంటారని అన్నారు. జహంగీర్ పీర్ దర్గాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానికుల నుండి మొదట కొంత సమస్య ఏర్పడిరదని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చొరవతో వారితో మాట్లాడి ఎవరికీ ఏ నష్టం జరగకుండా పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారని, ఎమ్మెల్యే అంజయ్యను అభినందిస్తున్నట్టు చెప్పారు.
దర్గాలో ముజావర్లకు కూడా పలు విషయాల్లో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య మంచి మనిషని అందరి సమస్యలు గుర్తిస్తారని అందరికీ అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ అన్నారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో ప్రారంభించిన గిరిజన గురుకుల పాఠశాల భవన సమావేశంలో మాట్లాడుతూ విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. ఎన్ని నిధులైన విద్యాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టాక విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. విద్య లేకపోతే ఏ అభివృద్ధి లేదని అందుకే విద్యపై ప్రభుత్వం ధ్యాస పెట్టిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. కెసిఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొమ్మిది సంవత్సరాల్లో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. దర్గా అభివృద్ధి కోసం సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యే అంజయ్య స్థానికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన చేతుల ద్వారా ప్రారంభించడం శంకుస్థాపనలు చేయడం ప్రజలకు సమస్యలు తీర్చడం ఎంత సంతోషం కలిగిస్తుందని ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు…..





