ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 9 :  కడ్తాల మండల కేంద్రంలోని హన్మాస్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో కొలువైయున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయములో కడ్తాల గ్రామ నివాసి నేనావత్ కమ్లి జాన్యా నాయక్ దంపతుల   ఆధ్వర్యంలో కార్తీకమాసం రెండవ శనివారం ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి అభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతంలో కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలని,భక్తి మార్గంలో నడవాలని సూచించారు. అదేవిధంగా దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సెవ్యా నాయక్, సుదీర్ రెడ్డి, పాండు నాయక్, కృష్ణయ్య, నాగార్జున, శకృ, సురేష్, రాజేష్, శ్రీను మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *