ఆధునిక వ్యాపారాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : డ్రోన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ అండ్ రోబోటిక్స్, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వంటి కొత్త విభాగాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడుగుపెడుతోందని ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే డ్రోన్, ఈవీ వ్యాపారంపై పనిన ప్రారంభించిందన్నారు. రాబోయే కాలంలో దీనిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో వివాంటా డ్రోన్ రీసెర్చ్ సెంటర్ టాంజానియా లిమిటెడ్(వీడీఆర్ సీటీఎల్)తో ప్రాథ‌మిక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. అసెంబ్లీ లైన్ ఏర్పాటుతో పాటు డ్రోన్ల ఆర్ అండ్ డీ కోసం వీడీఆర్ సీటీఎల్ లో 50 శాతం వాటాను వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేయనుందని చెప్పారు. ఆఫ్రికా ఖండం నుంచి గణనీయమైన వ్యాపార అవకాశాన్ని కంపెనీ ఆశిస్తోందని, ఇందుకు ప్రాజెక్టును వేగవంతం చేయాలని చూస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *