ఆదినారాయణ, శేజల్ మోసాలపై విచారణ చేపట్టి శిక్షించాలి

•నేతకాని మెహర్ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ బోర్లకుంట దీపక్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గ్రామీణ పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని బోగస్ ఆరిజిన్ సంస్థ పేరుతో పాడి పరిశ్రమ రుణాలు, గేదెలకు, ఆవులకు ఇన్సూరెన్స్, నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో అమాయక రైతులు, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్న అరిజిన్ డైరీ సంస్థ డైరెక్టర్లు కందిమళ్ళ ఆదినారాయణ, శేజల్ లపై ప్రభుత్వం విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నేతకాని మెహర్ సంక్షేమ సంఘం జాతీయ జాతీయ కన్వీనర్ బోర్లకుంట దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. వారి అక్రమాలను ప్రశ్నించిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన బాధిత రైతులతో కలిసి వారు మాట్లాడుతూ ఆదినారాయణ, శేజల్ లు బోగస్ సంస్థలు ఏర్పాటు చేసి గత 15 సం. లుగా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. వీరపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులు ఉన్నాయని తెలిపారు. ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 1600 మంది నుంచి రూ.68 లక్షలు వసూలు చేశారని అన్నారు. వీరిపై నార్త్ జోన్ డీసీపీపి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అరిజన్ సంస్థ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాధితులు సంతోష్ కుమార్, శ్రీపతి బుచ్చన్న, జాడి రాజేష్, ఎస్.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *