సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ఆత్మగౌరవ భవనాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని సాధ్యమైందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. గురువారంసిద్దిపేట జిల్లా కేంద్రంలో ముదిరాజ్ ఏ సి కన్వెన్షన్ హాల్ ని ప్రారంభోత్సవంకు బండ ప్రకాష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.సిద్దిపేట పట్టణం లో ముదిరాజ్ ఏ సి కన్వెన్షన్ హాల్ ని దిగ్విజయంగా పూర్తి చేయించిన హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవస్థానాలలో కొమురవెల్లి, యాదగిరిగుట్ట, వేములవాడ ఇంకా తదితర ప్రాంతాలలో హరీష్ సహకారంతో ముదిరాజ్ సత్రాలు ఏర్పాటు చేసుకుంటున్నామనీ, ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆలోచనలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల ఆత్మ గౌరవం కోసం హైదరాబాద్ కోకాపేటలో 5ఏకురాల స్థలం లో ముదిరాజ్ ఆత్మ గౌరవ భవనం నిర్మించుకోబోతున్నామన్నారు. వనపర్తి లో రెండు కోట్ల తోటి మహబూబ్ నగర్ లో మూడు కోట్ల తోటి ముదిరాజ్ భవనాలు ఏర్పాటు చేయికుంటున్నా. ఆత్మగౌరవ భవనాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని సాధ్యమైందన్నారు.రాష్ట్రం సకారమైన తర్వాతనే ముదిరాజులను అద్భుతమైన చేయూతనిచ్చి 2000 సొసైటీలో ఏర్పాటు చేసిన ఘనత కూడా కె సి ఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. చెరువుల విస్తీర్ణంతోని సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు సభ్యత్వం ఇవ్వాలని చట్టం తెచ్చిన మాట కూడా గుర్తు చేశారనీ, గతంలో చెరువుల, కుంటలు గ్రామపంచాయతీ పరిధిలో ఉండేవి ముదిరాజు లు చాపలు పట్టాలంటే ఇబ్బంది పడేవారు .ముఖ్యమంత్రి ఆశీస్సులతో జీవో తెచ్చి మత్స్యశాఖ పరిధిలోకి తెచ్చారన్నారు.రాష్ట్రంలో టీవీఎస్ , ఆటోలు, బొలెరో వాహనాలు ఇచ్చి ముదిరాజు ల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. మొదటిసారి తెలంగాణ వచ్చాక ముదిరాజ్ బిడ్డ పిట్టల రవీందర్ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారనీ,గత పాలకులు ఉన్నపుడు అవకాశాలు రాలే ముదిరాజులను దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు.ముదిరాజు లను వేధిస్తున్న సమస్య బీసీ డీ నుంచి బీసీఏకి పోవాలి మెరుగైన రిజర్వేషన్ సౌకర్యాలు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ , జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రోజా శర్మ , ఎం ఎల్ సి రఘోత్తం రెడ్డి , తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు కొట్టల యాదగిరి , జగన్ , బలరoగం , మాణిక్యం , బొక్క శ్రీనివాస్ , ధర్మ గారు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా నలు మూలల నుండి వచ్చిన ముదిరాజ్ పాల్గొన్నారు.



