ఆడ మగ తేడా లేకుండా అందరి మైండ్ సెట్ మారాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: జండర్ సెన్సిటైజేషన్ ఫర్ యూత్ శివమ్స్ గార్డెన్ లో సంజీవిని పారామెడికల్ కాలేజ్ బాలికలకు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ  ఫౌండేషన్ ఏపీఎఫ్  సహాయ సహకారంతో  గత రెండు రోజుల నుండి స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో 60 మంది అమ్మాయిలకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత హాజరై ఈ సందర్భంగా  మాట్లాడుతూ…ఆడ మగ తేడా లేకుండా అందరి మైండ్ సెట్ మారాలనీ అన్నారు.జండర్ తేడా లేకుండా ముందుకు వెళితే సమాజ శ్రేయస్సు దేశ అభివృద్ధి ఉన్నతంగా ఉంటుంది.వ్యక్తిగతంగా మనిషి మారినప్పుడు కుటుంబం సమాజం మారుతుందని తెలిపారు, మనిషిలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుందన్నారు. 60 మంది పారా మెడికల్ సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని, చట్టాలకు సంబంధించిన మెటీరియల్ అందజేయడం జరిగిందన్నారు. వారు వారి వారి గ్రామాలలో  పట్టణాలలో ప్రజలకు యూత్ పిల్లలకు ఫోక్సో,  మహిళల రక్షణకు ఉన్న చట్టాల అవగాహన కల్పించాలని సూచించారు.సమాజంలో స్త్రీ, పురుష, కుల, మత భేదాలకు అతీతంగా  అందరూ సమానమేనని మన ప్రవర్తన కూడా అలానే ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు రూపొందించిన అన్ని చట్టాలను గౌరవించడంతోపాటు ఇతరులు కూడా గౌరవించేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.బాధ్యతాయుతమైన పౌరునిగా మెలగడానికి మనిషికి ఉండవలసిన లక్షణాలు  మానవత్వంగా మెలగడం నిజాయితీ నిష్పక్షపాతంగా క్రమశిక్షణ ఉంటూ తాను అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం మంచి పనులు చేయడానికి మాత్రమే ముందుండడం ఇతరుల పట్ల గౌరవంగా ఉండడం నమ్మకాలను పెంపొందించుకోవడంలో ధైర్యంగా ఉండడం బాధ్యతాయుతమైన భావాలను కలిగి ఉండడం సమాజ కోసం పాటుపడే ఒక వ్యక్తి వ్యక్తిలా ఉండడం అంశాల గురించి వివరించారు. ఆడ మగ అని తేడా లేకుండా సమానత్వంగా చూసినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు దేశ అభివృద్ధికి ఇరువురు సమానంగా పనిచేస్తున్నారని  సమాజంలో జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటీ ఉండాలని తెలిపారు  దీని గురించి మనమందరం సమన్వయంతో పని చేయాలని సూచించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా స్వార్డ్  స్వచ్ఛంద సంస్థ సీఈవో శివకుమారి, పి గిరిజారాణి జండర్ సెన్సిటైజేషన్ స్పెషలిస్ట్  మాట్లాడుతూపారామెడికల్ సిబ్బందికి  రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ మరియు చట్టాలకు సంబంధించిన బుక్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.మన ద్వారా సమాజంలో మార్పు రావాలని దానికి అందరం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆడ మగ వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని,నేటి తరం స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు కూడా మహిళలకు ఎంతో తోడ్పడుతున్నాయని తెలిపారు. మనిషిపై నమ్మకం చాలా ముఖ్యమని, సమాజంలో ఉన్న సామాజిక సామాజిక  రుక్మతుల గురించి తెలిపారు. ఆడ మగ అని తేడా లేకుండా సమాజంలో సమన్యాయం ఉండాలని సమాజం అప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు మనిషిలో మార్పు చాలా ముఖ్యమన్నారు  మైండ్ సెట్ మారితే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. జెండర్ ఏ పదాల్లోకి వస్తాయో వివరించారు. ప్రకృతి  సైన్స్ నుండి వచ్చిందని, జెండర్ సమాజం నుండి వచ్చిందని తెలిపారు. జెండర్ ఈక్వాలిటీ ఈక్విటీ  గురించి  ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. జెండర్, ఈక్వాలిటీ, ఈక్విటీ జెండర్ బేస్డ్ వైలేషన్స్, కౌన్సిలింగ్,  సూటేబులిటీ డెవలప్మెంట్ గోల్స్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్ పర్సన్స్,  తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా   అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *