ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్) ఎపి రేణిగుంటలో తన అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిందని ఆటోమోటివ్ మాను ఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలలో విస్తరించిన 104 సర్వీస్ టచ్ పాయింట్ల విస్తృతమైన నెట్ వర్క్ తో అశోక్ లేలాండ్ సంస్థకు సంబంధించిన అతి పెద్ద డీలర్లలో ఆటోమోటివ్ ఒకటి అన్నారు. వ్యూహాత్మకంగా 716 జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన ఈ కేంద్రం.. అన్ని దక్షిణాది రాష్ట్రాలను కలిపే కీలకమైన జంక్షన్ గా పనిచేస్తుందన్నారు. తిరుపతి, దాని పరిసర ప్రాంతాలలో వివిధ వాహన విభాగాలు, ముఖ్యంగా టిప్పర్లు, ట్రావెల్ బస్సులు, ఐసివి గూడ్స్ వాహనాలు బాగా పెరిగాయన్నారు. ఇది తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రధాన రాష్ట్రాల నుంచి వెళ్ళే వాహనాలకు కీలకమైన స్టాప్‌గా పనిచేస్తుంది. నిర్వహణ సేవలు, 24×7 బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, యాడ్ బ్లూ లభ్యతను అందిస్తుందన్నారు. ‘కోయి మంజిల్ దూర్ నహీ’ అనే నినాదంతో కస్టమర్లను సంతోషంగా ఉంచడం అంతిమ నినాదం న్నారు.




