కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్ 02:ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపూర్ వెంకటయ్య గౌడ్ అన్నారు.చౌడపూర్ మండలంలోని కొత్తపల్లి తండాలో మండల పార్టీ అధ్యక్షుని బందయ్య ఆధ్వర్యంలో అమృత కలశం యొక్క పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాద్ కి అమృత్ మహోత్సవం ముగింపు సందర్భంగా నా భూమి నాదేశం కార్యక్రమంలో భాగంగా తమ ఇంటి నుండి చిటికెడు మట్టిని తీసుకుని వచ్చి అమృత కలశంలో వేసి దేశ అభిమానమును చాటు కున్నారు.మేరీ మట్టి -మేరీ దేశ్ అనే సందేశం పై ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో మనమంతా భాగస్వాములు కావాలని అన్నారు.మన దేశం కోసం పోరాడిన త్యాగదనుల త్యాగాన్ని గౌరవిస్తూ దేశ రక్షణ పురోగతికి మనల్ని మనం అంకితం చేసుకోవలసిన అవసరం ఉంది.ప్రతి గ్రామం నుండి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలోని పవిత్ర అమృత వాటిక నిర్మాణంలో మనమంతా భాగస్వామ్యం అవుదామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,కుల్కచర్ల మండల అధ్యక్షుడు గాదే మైపాల్, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కిషన్ మోర్చా మండల అధ్యక్షులు మాసయ్య,చరణ్, భరత్,సునీల్, క్షత్రియ పాండు,రఘు, శ్రీకాంత్, రాహుల్, జిల్లా కార్యవర్గ సభ్యులు దోమ రమేష్,అనిల్ పరిగి మండల ప్రధాన కార్యదర్శి నరసింహులు కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



