ఆకాశమే హద్దుగా ఆవిష్కరణలు..

ఒకప్పుడు ఏదైనా కొత్త గా ఆవిష్కరణ జరిగిందంటే దాని వెనుకాల చాలా కృషి ఉండేది. సంవత్సరాలకు సంవత్సరాలు  ప్రయోగాలు చేస్తేనేగానీ కొత్త ఆవిష్కరణ జరిగేడిది కాదు. ఓ కొత్త విషయం కనుగొనడానికి సైంటిష్టు తన జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసేవారు. ఈ ఆవిష్కరణలు చేసేవారు యుక్త వయసులో తమ ప్రయోగాల్ని మొదలు పెడితే, ఏ 60 వ ఏటనో ఆ ప్రయోగ ఫలితాల్ని కనుగొనేవారు. కాలం మారింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందడం జరిగింది. ఇప్పుడు ఆవిష్కరణలన్నీ చాలా తక్కువ సమయంలోనే విశ్వంలో విడుదల అవుతున్నాయి. మొబైల్‌ ‌ఫోన్‌ ‌లతో సాంకేతిక విప్లవం లో దూసుకు వెళ్తూ రిమోట్‌ ‌తో నడిచే కార్లను తయారు చేస్తూ అతి చిన్న శస్త్ర చికిత్సలను చేసే రోబోలను సృస్టిస్తున్న మనిషి భవిష్యత్తు కాలంలో మరింతగా కృత్రిమ మెదోసంపత్తి పెరుగే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రానున్న కాలంలో మరింతగా అభివృద్ది దిశలో ప్రపంచాన్ని శాసించే స్తాయిలో దేశ భవిష్యత్తును రూపొందించడంలో విద్యార్థుల పాత్ర గణనీయమైయనది. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ లో దేశాన్ని అగ్రగామిగా ఉంచడంలో విద్యార్థుల పాత్ర కీలకం. మనిషి ఆలోచనలతో తన వలె ఆలోచించే మెషీన్‌ ‌లను తయారు చేస్తున్నాడు. మనిషి-తన సృజనాత్మకత, తెలివి, విజ్ఞానంతో తన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చుకుంటూ సామాజిక ఉత్పత్తిలో భాగస్వామిగా మారారు. మేధో సంపత్తి ఆధునిక సమాజ అభివృద్ధిలో కీలకమైనది. సాధారణంగా మేధో సంపత్తి హక్కు అనేది మానవ మేధస్సు నుంచి ఆవిష్కృతమైన ఉత్పత్తి ఇతరులు అనధికారికంగా ఉపయోగించకుండా రక్షించే చట్టం. మానవ ఉత్పాదనలలో అత్యుత్తమమైనది జ్ఞానం, ఆలోచన. ఏ నూతన ఆవిష్కరణకైనా ముడిసరుకు సమాజమే. సమాజంలోని అనేక వనరులను ఉపయోగించుకొని తమ తెలివితేటలు, విజ్ఞానంతో నూతన ఆవిష్కరణను సృష్టించగలుగుతారు.

మానసిక ఆరోగ్య రంగం లో నూతన ఆవిష్కరణలు అవసరం

image.png

ప్రస్తుతం ప్రతి రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మరియు విస్తరణకు ఆవిష్కరణలు చేయడం అతి ప్రాధాన్యమైనది. ఆవిష్కరణను ప్రోత్సహించే సాధనాలను ఉపయోగించటానికి వివిధ అవకాశాలను అందించాలి. అనేక రకాలైన పరిశోధనలు, ప్రభుత్వాలు అవకాశాలను సృష్టించడం, సరైన గుర్తింపును కలిపించడం వల్ల మాత్రమే కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మహానగరాలు, నగరాలను దాటి గ్రామీణ ప్రజలు కూడా కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం ఫలితాలను రుచి చూస్తున్నారు.  పెద్దా, చిన్న రంగమనే వ్యత్యాసమనేది లేకుండా అన్నీ రంగాల్లోనూ విస్తరించింది. ఆవిష్కరణలకు సంబంధించిన అన్నీ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మానసిక ఆరోగ్య రంగంలో కొత్తగా వస్తున్న టెక్నాలజీలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరమైన చోట వీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలను త్వరితగతిన  తగ్గించుకోవచ్చు. పరిశోధనలు, క్లినికల్‌ ‌ట్రయల్స్‌కు నూతన టెక్నాలజీలను విరివిగా ఉపయోగిస్తున్నారు. సమాజంలో ప్రజల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో మానసిక ఆరోగ్య నిపుణుల పాత్ర ఎంతో ఉంది.
సమాజ శ్రేయస్సు కోసం ఇంటెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్
‌పారిశ్రామిక, శాస్త్రీయ, సాహిత్య మరియు కళాత్మక రంగాలలో మేధో ఫలితాల యాజమాన్యాన్ని ఐపిఆర్‌ (ఇం‌టెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్) ‌విస్తృతంగా సూచిస్తుంది. ఐపిఆర్‌ (ఇం‌టెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్) ‌సృష్టిపై ఆవిష్కర్తలకు కొన్ని ప్రత్యేక హక్కులను కలుగ చేస్తుంది. ఆవిష్కర్తలకు వారి పెట్టుబడుల నుండి సరసమైన రాబడిని పొందే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఆవిష్కర్తలను నూతన పరిశోధనలు చేయాడానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సమాజ శ్రేయస్సు ప్రయోజనాల కోసం సృజనాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడం ఇంటెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్ ఎం‌తగానో దోహదం చేస్తాయి. పేటెంట్‌ ‌హోల్డర్‌ అనుమతి లేకుండా తమ ఆవిష్కరణను వాణిజ్యపరంగా ఇతరులు కాపీ చేయడం కానీ, దొంగలించడం కానీ చేయకుండా ఆవిష్కర్తకు హాక్కును అందిస్తుంది. ఈ హక్కులను పొందడం ద్వారా, పేటెంట్లు ఆవిష్కర్తలకు ఆర్థిక పరమైన ప్రోత్సాహకాలను అందిస్తాయి, వారి సృజనాత్మకతకు సరైన  గుర్తింపును అందిస్తాయి. అంతే  కాకుండా వారి పెట్టుబడి సరైన ఫలితం పొందునట్లుగా వాటిని అనుమతిస్తుంది. పేటెంట్‌ ఒక శక్తివంతమైన వ్యాపార సాధనం, కొత్త ఉత్పత్తి లేదా ప్రక్రియపై ప్రత్యేకతను పొందటానికి, బలమైన మార్కెట్‌ ‌స్థితిని అభివృద్ధి చేయడానికి మరియు లైసెన్సింగ్‌ ‌ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఆవిష్కర్తలను అనుమతిస్తుంది.
ఆలోచనలు సృజనాత్మకతలతో ప్రపంచాన్ని శాసించాలి
దేశ యువత, విద్యార్థులు నూతన ఒరవడితో ఎన్నో రకాలైన నూతన యాప్స్ ‌ను సృష్టిస్తున్నారు.  ఈ శాస్త్ర సాంకేతిక అభివృద్ది దేశ ప్రజల కు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం దేశ యువత సాంకేతిక విజ్ఞానం లో మెదడుకు పదును పెడుతూ దేశం లో పేరుకు పోయిన ఎన్నో సమస్యల కు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు, పరిష్కార మార్గాల ను శోధించి, సాధిస్తున్నారు. విజయ బాహుటా ఎగరవేస్తున్నారు. యువత నూతన ఆలోచనలు, సృజనాత్మకతతో ప్రపంచాన్ని శాసించే స్తాయికి ఎదుగుతున్నారు. సమస్యలకు నూతన పరిష్కారాలను అన్వేషించగల అసాధారణమైనటువంటి సామర్ధ్యం మన సొంతం.  నూతన పోకడలకు తగ్గట్లుగా ఆలోచనల సరళికి పదును పెడుతూ అసాధ్యం అనిపించేటటువంటి నిర్ణయాలను ఎలా తీసుకోవాలో మన చేతుల్లోనే ఉంది. ఆలోచనల సరళి మనకు సమస్యలను ఎదుర్కొనే శక్తి సామార్ద్యాలను, సమస్యలను పరిష్కారం చేసే  పద్ధతులను సూచిస్తుంది.
image.png
డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ (‌మెంటల్‌ ‌రిటార్డేషన్‌)
 ‌రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *