అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి  బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 4: తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని  దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని  గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా  మాట్లాడుతూ.యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కోసం ఎదురుచూస్తుంది అని అన్నారు.దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.తెలంగాణరాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలి చావులు ఉండేవి. నేడు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజల మూడు పూటలు కడుపు నింపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు.నేటికీ బిజెపి పాలిత ప్రాంతాలలో ప్రజల ఆకలి చావులు కొనసాగుతున్నాయి.రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నామన్నారు.యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు.నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కితాబిచ్చారు.దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన  కేసీఆర్ పాత్ర కీలకం కానుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు  ప్రధాన పాత్ర  పోషిస్తున్నారని వారిని కొనియాడారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం అందరం కలిసి  సమన్వయంతో ముందుకెళ్లాలని  ఎన్నికల్లో ప్రజలని మభ్యపెట్టి ఆందోళనలకు గురిచేసి మాయ మాటలు చెప్తారని వాటిని మనము అందరం తిప్పికొట్టాలని అన్నారు.పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9ఏండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  సంక్షేమ కార్యక్రమాలు మనల్ని మూడోసారి అధికారంలోకి తేవడం ఖాయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, ప్యాక్స్ చైర్మన్ జె.వెంకటేష్ గౌడ్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, వైస్ ఎంపీపి కృష్ణా గౌడ్, సమన్వయ సమితి సభ్యులు మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి,వెంకట్ నర్సింహారెడ్డి,  రఘుపతి రెడ్డి, చిన్న మల్లయ్య, బాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ  ఆంజనేయులు నాయకులు రమేష్ గౌడ్ ,సర్పంచ్ బాల్ చంద్రం, చంద్రం, శివ కుమార్, మోహన్ బాబు, రామ గౌడ్ ,కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *