తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: అవినీతి కీ తావు లేకుండా పని చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలో వార్డు నెంబర్ 25 జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉందని అన్నారు. ఎవ్వరు కూడా అవినీతి కీ తావు లేకుండా పని చేయాలని అప్లికేషన్ లకు ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ రత్నమాల నీరజ బాల్రెడ్డి భీమ్ సింగ్ బోయ రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి బసవరాజు నాయకులు బాల్రెడ్డి అబ్దుల్ రహుప్ పట్టణ అధ్యక్షులు అభిబ్ లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి కీ తావు లేకుండా పని చేయాలి





