అర్హులకే దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిలదీత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 11 : ఎమ్మెల్యే గారు మీకు రుణపడి ఓట్లు వేస్తున్నాం.. కానీ మాకు దళిత బంధు ఇవ్వడంలేదు అంటూ మాడుగుల మండలం చంద్రాయన పల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను నిలదీశారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి గేట్ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లో పోలె పల్లి, మాలెపల్లి, సింగంపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరెందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రాయన పల్లి గ్రామానికి చెందిన మహిళలు ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి మా గ్రామాన్ని దత్తత తీసుకున్నామని చెప్పారు ..? దత్తత తీసుకుంటే అధికార పార్టీకి చెందిన వారికే దళిత బంధు ఇస్తారా బీదలమైన మాకు ఇవ్వరా అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *