అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు బెదిరింపు కాల్స్

న్యూ దిల్లీ, జనవరి 31 : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ ‌వొచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు పీసీఆర్‌ ‌కాల్‌ ‌చేసినట్లు కేజీవ్రాల్‌ ‌వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్‌ ‌నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

కేజీవ్రాల్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. కాల్‌ ‌చేసిన వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతను దిల్లీలోని గులాబీ బాగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో అతన్ని అరెస్టు చేయలేకపోయామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *