అమ్మవారి ఆశీస్సులతో  ప్రచారం బాగా సాగాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరిని చల్లగా చూడాలని, ప్రచారం బాగా సాగాలని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం రామంతపూర్ మెయిన్ రోడ్ లోనీ  శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం లో  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బి జె పి ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, హబ్సిగూడ  కార్పొరేటర్ చేతన హరీష్, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *