ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: శ్రీ దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీ, రెడ్డి బ్రదర్స్ గల్లీ నందు ఏ ర్పాటు చేసిన పలు అమ్మవార్ల మండపల్లో జరిగిన పూజల కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నాట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, గండి సన్ని యాదవ్,రమణారెడ్డి,విక్కీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు




