అమిత్‌ ‌షా ఎన్టీఆర్‌ ‌భేటీలో రాజకీయాలకు ప్రాధాన్యం లేదు

అల్లూరి, ముంబై, అగస్ట్ 22 : ‌హైదరాబాద్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా ను జూ. ఎన్టీఆర్‌  ‌కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత నిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌చిత్రంలో ఎన్టీఆర్‌ ‌నటన నచ్చడంతో అమిత్‌ ‌షా ఆయనను భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. షా, ఎన్టీఆర్‌ ‌సినిమా  అంశాలే మాట్లాడుకున్నారని, వారి మధ్య రాజకీయ చర్చలు రాలేదని చెప్పుకొచ్చారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ ‌చరిత్ర.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలపైనే ఎక్కువగా చర్చించారని చెప్పారు. అమిత్‌, ఎన్టీఆర్‌ ‌భేటీపై విమర్శలకు తాను స్పందిచనని, ఏమైనా ఉంటే వారినే అడగాలని కిషన్‌రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్‌ ‌భేటీ వెనుక రాజకీయ ప్రాధన్యత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. వీరిద్దరి సమావేశం రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని అన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి దాడిచేసి వందేళ్లు పూర్తయిన దృష్ట్యా శత జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌ముండా , ఏపీ డిప్యూడీ సీఎం రాజన్న దొర హాజరయ్యారు. సందర్భంగా 9 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం డియాతో కిషన్‌ ‌రెడ్డి మాట్లాడారు. నిన్న తెలంగాణలోని మునుగోడులో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన అమిత్‌ ‌షా రాత్రి జూనియర్‌ ఎన్టీఆర్‌తో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు పలు రకాల అనుమానాలు వస్తుండడంతో ఇద్దరి భేటీపై కిషన్‌రెడ్డి స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *