అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ ను గెలిపిస్తాయి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 31 : అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్ రావు, మండల పరిషత్ వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలం కోనపూర్ గ్రామం లో  జడ్పీటీసీ అనురాధ – పత్యనాయక్, మండల పరిషత్ వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, ఎంపీటీసీలు సరిత – పంతు గ్రామ అధ్యక్షులు కడారి రాజు, నాయకులు కంబాలపల్లి రవి, మండల నాయకులు, కార్యకర్తలు మహిళలు కలిసి కోనపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ ను  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గడప గడప కు వెళ్లి బిఆర్ఎస్ మేనిఫెస్టో వివరించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *