అభివృద్ధిలో మేటి అమీన్ పూర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: నాలుగు సంవత్సరాల్లో అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మేటిగా నిలిపామని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ, లాల బావి కాలనీ. భరత్ నగర్ కాలనీ, సాయి అంబికా కాలనీ, బృందావన్ టీచర్స్ కాలనీ, ఇండస్ వ్యాలీ హోమ్స్ కాలనీలలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి, ఆయా వార్డుల సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *