అభివృద్ధిని చూసి ఓటు వేయండి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 

*ఒకే రోజు 65 అభివృద్ధి పనులకు శ్రీకారం
*12.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
*ఆనందం వ్యక్తం చేసున్న సిటిజన్స్
*అభివృద్ధికి కేరాఫ్ గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటు ప్రశంసలు
*నిర్విరామంగా 15 గంటలకు పైగా పర్యటించిన మంత్రి
మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 28: అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని, నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి నాకు ఓటు వేసి ఆశీర్వదించాలని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  మంత్రి సుడిగాలి పర్యటన చేసి, రూ.12.50 కోట్ల విలువ గల ఒక్కటి కాదు 10 కాదు ఏకంగా 65 అభివృద్ధి పనులకు గల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఉదయం 7 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బిఏంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి, పలువురు బిఅర్ఎస్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు వాయిద్య మేళాలతో పూల వర్షం కురిపిస్తూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మండుటెండను, ఓరు వానను  కూడా లెక్క చేయకుండా మంత్రి తన పర్యటన నిర్విరామంగా కొనసాగించారు. అదే సమయంలో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ.. స్థానికంగా నెలకొన్న ప్రతి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రితో పోటోలు దిగి, మా ఓటు మీకే అంటు తమ మద్దతు ప్రకటించారు. రాత్రి 11 గంటల సమయంలో కూడా వర్షాని సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద సంఖ్యలో మంత్రికి మంగళహారతులతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మీ ఆదరాభిమానాలను నేను ఎప్పటికీ మరువనని, ఎల్లప్పుడు మీకు సేవ చేసుకుంటానని అన్నారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమను ఎల్లపుడూ ఇలాగే కొనసాగాలని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నాకు ఓటు వేసి, మరోసారి ఆశీర్వదించాలని విన్నవించారు. నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చి ఆశీర్వాదించారని, అదే విధంగా మీరు కూడా కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. బిఏంసి పరిదిలో గల తొమ్మిది డివిజన్లలో దాదాపు 12.50 కోట్ల విలువ గల 65 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. 1,2.3,4,5, 22,24,26,30 డివిజన్ల పరిదిలో భూగర్భ డ్రైనేజీ, రోడ్లు, వంటి అనేక పనులకు శంకుస్థాపనలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ఎన్నడు లేని విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అభివృద్ధి, సంక్షేమమే రెండు కన్నులుగా భావించి ముందుకు పోతున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ అని, దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాలిటీలలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్  మహేశ్వరం పర్యటనలో విడుదల చేసిన రూ.150 కోట్లతో రెండు  కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ కు మంజూరు అయిన రూ.50 కోట్ల నిధులు ప్రణాళికలు రూపొందించి, త్వరలో పనులకు శ్రీకారం చుడతామన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో ట్రంక్ లైన్లు, నాళాల నిర్మాణాలతో వరద నీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. నాలాల అభివృద్ధి రూ.110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోతాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా నూతన పైప్ లైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడ పరిధిలోని 11 చెరువులను రూ.47 కోట్లతో అభివృద్ధితో పాటు సుందరీకరణ చేసి, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్ ల నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గం ప్రజలే తన బలం -బలగం అని, నియోజకవర్గ సమగ్రాభివృద్దే తన లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో గతంలో చేసిన వాగ్దానాలతో పాటు చేయని వాటిని కూడా నెరవేర్చుతు  ముందుకు వెళ్తుతున్నట్లు తెలిపారు. సంక్షేమం-అభివృద్దే నినాదాలుగా, రెండు కళ్ళ లాగా భావించి మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాటానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్యం, విద్యుత్, చెరువుల సుందరీకరణ, నాలల అభివృద్ధి, దేవాలయాలు, దర్గాలు, చర్చిల అభివృద్ధితో పాటు రోడ్లు, లైట్లు, తాగునీరు, డ్రైనేజీలు, అర్బన్ పార్కులతో పాటు నియోజకవర్గములో అన్ని రంగాల అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. అడగగానే నియోజకవర్గానికి వేల కోట్ల నిధులు ఇస్తున్న సీఎం కేసీఆర్  నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొక సారి ఆశీర్వదించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేసారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్లు, దళిత బంధు, బీసీ, మైనార్టీ బంధు, గృహ లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్, పేదలకు ఇళ్ళ స్థలాల  లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న కేసీఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ సుమన్ రావు, పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అర్జున్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ యాతం పవన్, సీనియర్ నాయకులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, సం రెడ్డి వెంకట్ రెడ్డి, భీమిడి జంగా రెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు కవిత రామిడి రాంరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, స్వప్న వెంకట్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, స్వప్న జంగారెడ్డి,లిక్కి మమత కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *