ఎన్నికల ప్రవర్తన నియమావళి విషయమై చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు అభ్యంతరాలు లేవదీస్తున్నారు నియమావళి పేర ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల ప్రక్రియ మొదలై,ముగిసేంతవరకు పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యవహరించాల్సిన తీరుతెన్నులే అయి ఉండాలి. అంతకుమించి ఉండడం భావ్యం కాదేమో,కానీ మన ఎన్నికలు ఏడూ దశలుగా తతంగమంతా నెలల ప్రక్రియ ఎన్నికల ముగిసిన చాలాకాలం వరకు ఫలితాలు ప్రకటించారు ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా ఇది మాట్లాడవద్దు అది చేయవద్దు అంటే సమంజసం కాదేమో.ఎన్నికల ప్రసంగాలను సాకుగా చూపి ఉన్నదానికి, లేనిదానికి అభ్యంతరాలు లేవదీసి నోటీసులు ఇవ్వడం పరిపాటయింది. మొన్న రెండు దశలు పూర్తయిన ప్రక్రియలో రిజర్వేషన్స్ మీద ఏదో వ్యాఖ్యలు చేశాడని ఏకంగా తెలంగాణ సీఎంనూ హాజరు కావాలని నోటీస్ ఇవ్వడం దుమారం లేపింది.ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను అధికారిక మంత్రిమండలి సమావేశం నిర్వహించవద్దని ఆంక్షలు విధించింది.
ఉదాహరణకు ఇటీవల తెలంగాణలో వచ్చిన ఆకాల వర్షాలతో రైతన్నలకు అపారం నష్టం జరిగింది.ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలను ఆగమాగం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీటి పాలైంది. తెలంగాణ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన ఎన్నికల నియమాలు కఠినంగా అమలు చేయడం.అభివృద్ధికి ఆటంకంగా మారిందనే అభిప్రాయం ఏర్పడింది.తొలిసారిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కేరళలో 1960ఫిబ్రవరిలో శాసనసభ ఎన్నికల సందర్భముగా అమల్లోకి వచ్చింది. అన్ని రాజకియ పార్టీలు ఏకగ్రీవంగా ముసాయిదా నియమావళిని రూపొందించాయి.. ఇది స్వయం క్రమశిక్షణ, అందులో ఎన్నికల ప్రచారానికి, ఉపన్యాసాలకు,నిండ్లకు సంబందించిన ఆంక్షలు పొందుపరిచారు.1962లో రాష్ట్రాల శాసనసభ,లోకసభ ఎన్నికల సందర్భంగా ఇదే ముసాయిదాను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది. 1968,1969లో వివిధ రాష్ట్రాల మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఈ ముసాయిదాను ఎన్నికల సంఘం ఒక డాక్యుమెంట్ ను తయారుచేసింది.
అందులో రాజకీయ పార్టీల బాధ్యతలను వివరించింది.ప్రస్తుత ప్రవర్తనా నియమావళి కొన్ని మార్పులు,చేర్పులతో అమలు జరుగుతున్నది.ఈ నేపథ్యంలో ఉత్పన్నమయ్య మౌలికమైన ప్రశ్న ఎన్నికల తతంగం ముగిసేంతవరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనేదే.ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఏ ఆంక్షలు లేకుండా విధులు నిర్వహించడానికి అవకాశం ఉండాలి, అంతర్లీనంగా గాని, బహిర్గతంగా గాని రాజ్యాంగంలో నైనా,మరెక్కడైనా ఫలానా విధాన నిర్ణయమైనా, ఆర్థికపరమైన నిర్ణయమైనా తీసుకురాదని చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో నిరంతర పాలన కొనసాగడానికి పేద వర్గాల లబ్ధికి, అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలవడానికి ఆర్థిక భారంతో నిమిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఆంక్షలు ఉండకూడదు.కాలం చెల్లిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి,సంక్షేమ బాటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
కొత్తగా ఏర్పాటు చేసిన రేవంత్ ప్రభుత్వానికి నాలుగు నెలలు గడవక ముందుకే ఎన్నికల నోటిఫికేషన్ రావడం,వచ్చిన నాటి నుంచి ఆరు గ్యారెంటీలపై ఫోకస్ పెట్టింది.ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడం,ఇక్కడ 13వతేదీన ముగిసిన కూడా అందుకే నియమావళి సాకుతో సమీక్షలు నిర్వహించకపోతే ఎన్నికైన ప్రభుత్వానికి అర్థమే లేదనే భావంతో,ఇప్పటికే వివిధ శాఖలపై సమీక్షలు సీఎం రేవంత్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కకావికలమవుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు రుణమాఫీ,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చే సమస్యలు, సహాయక చర్యల కోసం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రిమండలి ఏర్పాటు చేయాలనుకున్న సీఎం రేవంత్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరితే ఇవ్వలేదు.చెరువుగా మారిన రైతన్న గుండె బరువు కాకుండా ఆదుకోవాలని మంత్రులతో రేవంత్ సమీక్షలు కొనసాగుతున్నాయి.నిజంగానే ఎన్నికల సంఘం భావిస్తున్నట్లుగా ఓటర్లను ప్రభావితం చేయడం అనే సమస్య తెలంగాణ లో తలెత్తే అవకాశం పోలింగ్ మూగిసినందున లేదు.
ముఖ్యమంత్రి వివిధ స్థాయిల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం.ఎన్నికల కోడ్ ఉన్నా,లేకపోయినా సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి,ముఖ్యమంత్రికి రాజ్యాంగపరంగా గురుతరమైన బాధ్యత ఉందో ,సివిల్ సర్వెంట్లకూ ఆంతే బాధ్యత ఉంటుంది. అధికారికి,మంత్రికి మధ్య పరస్పర అవగాహన ఉన్నప్పుడే ప్రభుత్వం ప్రక్షాళన చేయకల్గుతుంది.భారతదేశ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో నెలల తరబడి ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటే ప్రభుత్వాలు పనిచేసేదెలా? అనేది సమాధానం లేని వేయ్యు డాలర్ల ప్రశ్న.
డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355





