అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్  అన్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని ఆలయ ప్రాంగణంలో  భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమి పురష్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు  వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత దంపతులు,పర్వత్ పల్లి సర్పంచ్ పాషాబాయి, ఆలయ పూజారులు భక్తులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *