అనుకుంటే సాధించలేనిదంటు ఏమీ లేదు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 05: చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బి కరుణాకర్ బుధవారం నాడు విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో టిఎస్ఎస్ పి పోలీస్ శాఖకు ఎంపికైనరన్నారు.ఈ సందర్భంగా తోటి మిత్రులు జుట్టు కుమార్ ఆధ్వర్యంలో కరుణాకర్ ను  ఘనంగా సన్మానించారు.ఎన్నో కష్టాలను అవమానాలను ఆకలి బాధలను భరిస్తూ కంటికి కునుకు లేని రోజులు గడిపి అనుకున్న గమ్యాన్ని చేరుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ తను పోలీస్ అవ్వడం మా అమ్మ ఆశయం అన్నారు.తన తల్లి కోరిక మేరకు విజయం సాధింఛానన్నారు.తన తల్లి కల నెరవేర్చినందుకు తన జన్మ ధన్యమైందని వారు తెలిపారు.తను ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే సమయంలో ఆర్థికంగా నా మిత్రుడు జుట్టు కుమార్  ఆదుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా కరుణాకర్ జుట్టు కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో షాబాద్ రామాంజనేయులు,బేగరి అనిల్,మేడికొండ ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *