ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : అనాథలకు సిఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని, ఇందుకోసం ఈ నెల 3న జరిగే అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని కోరుతూ సోమవారం యూసుఫ్ గూడలోని ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్, అడ్మిన్ ఆఫీసర్ సునందకు వినతి పత్రం అందజేసినట్లు అనాథల హక్కుల పోరాట వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అంజలీ తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్క వెంకటయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంకటయ్య మాట్లాడుతూ సిఎం కేసీఆర్ ప్రభుత్వం అనాథ పిల్లలకు ఇచ్చిన హామిలు 8 సం.లు పూర్తి అయినా ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ ఉపసంఘం 40 డిమాండ్ల పైగా సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. అనాథ పిల్లలకు ప్రత్యేకంగా రాష్ట్రంలో జిల్లాకు ఒకటి(బాలికలకు, బాలురకు) సపరేటు, గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అనాథ పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేకంగ 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని, కేసిఆర్ ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలన్నారు. అనాథ పిల్లలకు వెంటనే స్మార్ట్ కార్డులు, కేజి టు పీజీ వరకు ఇంటిగ్రేటడ్ క్యాంపస్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అనాథలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, ప్రత్యేక కమీషన్, ప్రత్యేక కమిటి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అసెంబ్లీలో అనాదల అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కెటాయించి, అనాదల అభివృద్ధి కోసం కర్చుచేయాలన్నారు. అసెంబ్లీలో అనాదల సమస్యలను చెప్పుకోడానికి, ఒక అనాథ సభ్యున్ని నియమించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను సిఎం కేసిఆర్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ‘అనాథల అరిగోస దీక్ష’ కార్యక్రమాన్ని చెపడతామని హెచ్చరించారు.




