వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 22: అనంతగిరి ఘాట్ రోడ్డుల పైన వాహనాలు నిలిపితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. గత మూడు నాలుగు రోజుల నుండి వర్షాలు పడుతుండటం తో అనంతగిరి ప్రాంతానికి సందర్శకులు/పర్యాటకులు చాలా మంది రావడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి అనంతగిరి కి వచ్చిన వారు గాని, జిల్లా కు సంబందించిన వారు గాని కొందరు పర్యాటకులు తమ వాహనాలను అనంతగిరి కి వచ్చి పోయే ఘాట్ రోడ్డుల పైన పార్కింగ్ చేసాస్తున్నారు అని దృష్టికి రావడం జరిగింది అని అన్నారు. అనంతగిరి ఘాట్ రోడ్డులలో భారీ వాహనాలు, ఇతర వాహనాలు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి కావున పర్యాటకులు/సందర్శకులు ఎట్టి పరిస్థితులలో తమ వాహనాలను ఘాట్ రోడ్డుల పైన ఉంచవద్దు అని, వాహనాలకు పార్కింగ్ కొరకు ఏర్పాటు పార్కింగ్ ప్రాంతాలలో గాని, ఇతర వాహనాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ తెలిపినారు. ఘాట్ రోడ్డులలో వాహనాలు నిలిపితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఘాట్ రోడ్డుల పైన వాహనాలు నిలిపితే వర్షాలకు ముందు వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ కావున దయచేసి ప్రయాణకులు గాని పర్యాటకులు గాని సందర్శకులు గాని ఎవ్వరు కూడా ఘాట్ రోడ్డులలో వాహనాలు నిలపవద్దు అని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో కూడా ప్రయాణికులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్డుల మీద నిలపవద్దు అని,ఏమైనా అత్యవసరం ఉన్నచో డైల్ 100కి కాల్ చేయాలనీ జిల్లా ఎస్పీ తెలిపినారు.



