ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : అక్రమంగా మద్యం నిలువ ఉంచిన ,సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్ తెలిపారు. శనివారం ఆమనగల్ మండలంలోని పలు రైస్ మిల్లుల గోదాములు, కిరాణా దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ప్రభావితం చేసేందుకు కల్తీ మద్యం, సుంకం చేల్లించని మద్యం, ఇతర రాష్ట్రాల నుండి మద్యం దిగుమతి చేసుకొని ఓట్ల కొరకు ప్రజలకు పంచి పెట్టె అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అక్రమ మద్యం పంచినట్లయితే వెరిట్ అనే అప్ ద్వారా లేదా 1800-425-2523 టోల్ ఫ్రీ నెంబర్ కి లేదా ఆమనగల్లు ఎక్సైజ్ కార్యాలయం సెల్ నెంబర్లు 8712658742, 9000571671లకు సమాచారం అందించాలని కోరారు.
అక్రమంగా మద్యం నిలువ ఉంచిన,సరఫరా చేసిన కఠిన చర్యలు




