కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి బుధవారం స్థానిక నాయకులతో రాంపల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అందరూ ఆయన ఆశయాలను కొనసాగించడానికి కృషి చేయాలని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు అని అన్నారు. రాబోవు తరాలకు ఆయన మార్గదర్శకుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ నాయకులు గూడూరు ఆంజనేయులు గౌడ్, నిమ్మల శ్రీనివాస్, పంగ శ్రీహరి, రవి, లింగం తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం చైర్మన్





