యువత బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్ళు : రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు
మల్కాజిగిరి ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : యువత బలహీనత లను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంటు వ్యవస్థ ఒకరి నుంచి ఒకరికి గంజాయి అలవాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని, ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసిన గంజాయి వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తోందని, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు సూచించారు. రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్.బి నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసారు. గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తున్న యూపీకి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లు వాహనాల్లో గంజాయిని తరలిస్తు ముందు ఒక పైలెట్ వాహనంతో వెళ్తున్న ప్పుడు వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ కు ట్రాన్స్‌ఫోర్ట్ చేస్తుండగా పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారని తెలిపారు. వీరి వద్ద నుండి 360 కేజీ ల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాదినం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్స్, గంజాయిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు స్పష్టం చేశారు. ఎవ్వరు డ్రగ్స్, గంజాయి సప్లై చేసిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.




