పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అంగన్వాడి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.గత 6 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె ను సందర్శించి,సంఘీ భావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మె డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో వుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కాంట్రాక్ట్ వర్కర్స్ ఉండరని, అందరినీ పెర్మనెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీలు గాలికి వదిలేశారని అన్నారు.అంగన్వాడీ కార్యకర్తలను ఎందుకు పెర్మనెంట్ చేయడం లేదనిప్రశ్నించారు. కనీస వేతనం 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. నీళ్లు,నిధులు,నియామకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసంచేశరనిఅన్నారు. నియామకాల విషయంలో ముఖ్యమంత్రి కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.అంగన్వాడీ లకు గ్యారంటీ లేదని అన్నారు.అందరినీ పెర్మనెంట్ చేయాలని అన్నారు. సెంటర్స్ తాళాలు పగులగొట్టి , సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయతనిస్తున్నారనిఅన్నారు. .1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం రాష్ట్రంలో సమ్మె 14 రోజుల సమ్మె నోటీసు ఇచ్చి,సమ్మెను కొనసాగిస్తున్నారని అన్నారు.సమ్మెను అనచాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు.అంగన్వాడీ సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో కార్మిక వర్గం తో కలిసి సమ్మెను మరింత ఉదృతం చేయడంలో సహకారం వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి. నాగేశ్వరరావు,సీఐటీయూ నాయకులు సదాశివ రెడ్డి,టీచర్లు,శోభ,సంతోషి,రూప, సుభద్ర,మంజుల,ప్రమీల,ఆయాలు,శా రద,నాగమణి,మనెమ్మ,సంతోష,అమెనబెగం,లక్ష్మి,గీతా లు పాల్గొన్నారు.




