అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం అంగన్వాడి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 12వ రోజు సమ్మె సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ పూలమల వేసి మోమొరండం ఇచ్చి అక్కడి నుండి బీజేఆర్ రెస్ట్ హౌస్  వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంగన్వాడీల ర్యాలీకి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత రెడ్డి మద్దతు తెలుపగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ లు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సమన పనికి సమన వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విధంగా చట్టం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంటాక్ట్ విధానం రద్దు చేయాలని కోరుతూ ,గత 46 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలన్నారు. ఈ ప్రభుత్వం  మా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి లేనిచో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులను అడ్డుకొని సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం తీవ్రత చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *