మంది చేసిన మేలు

నిన్నటి పని ఈరోజుకి పాతబడి రిలవెన్స్ కోల్పోతున్న వేగవంతమైన లోకంలో ‘రైటర్స్ మీట్’ కథల కోసం పాతికేళ్ళుగా నిలబడింది. ఈ మైలురాయిని ఉత్సవభరితంగా దాటుతున్నది.  మార్చ్ 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో జరుగనున్న రైటర్స్ మీట్ రజతోత్సవ వేడుకలలో పాల్గొంటున్న కొందరు కథకుల సంతోషం వారిమాటల్లో- శోభ పాఠకుల కోసం.

ఒక వయస్సు దాటాక, కొత్త స్నేహితులు ఏర్పడడం దాదాపుగా అసాధ్యం. అప్పటికే సుస్థిరమైన అభిప్రాయాలు ఏర్పడడం, ఏం మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అనే జంకు, ఒంటరి జీవనంపై పెరిగే ప్రేమ- ఇందుకు కారణాలు కావచ్చు. రిటైరయ్యాక కథారచనలో అడుగుపెట్టిన నాకు యువ రచయితలతో స్నేహాలు, సాహిత్యప్రపంచంలో పరిచయాలు, పాఠకలోకపు పలకరింపులు ఇవన్నీ సాధ్యపడడానికి ఒకవైపు హైదరాబాదు నగరం, మరోవైపు రైటర్స్ మీట్ వంటి సమావేశాలు, కలయకలు కారణం. అసలు రచన అనేదే ఒంటరిగా పూనుకొనే ప్రక్రియ; ‘రాసుకుపూసుకు ఊరేగేకన్నా రాసుకుంటూ ఓమూల కూర్చోవడం ఉత్తమం,’ అనుకున్న నాకు కొత్త ఆలోచనలవైపు, ముఖ్యంగా సమకాలీన యువరచయితల అంతరంగాలను తెలుసుకోవడానికి రైటర్స్ మీట్ ఎంతగానో దోహదం చేసిందని చెప్పగలను. రైటర్స్ మీట్ లేకపోతే ‘తూరుపు గాలులు’ కథాసంపుటి, తత్ఫలితంగా దాని ఇంగ్లీషు, కన్నడ అనువాదాలు వెలువడేవే కాదు. నిర్వాహకులకు అభినందనలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *