“ఫాసిజానికి ఒక లక్షణం ఉంటుంది. అది మనుషులని విడదీసే లక్షణం. ఒక వర్గాన్ని బుజ్జగిస్తూ ఇంకో వర్గాన్ని అణగదొక్కే విధానాన్ని పాటిస్తుంది. హిందువుల నుంచి ముస్లిములనూ, అగ్ర కులాల నుంచి దళిత బహుజనులను, స్త్రీల నుండి పురుషులను విడదీస్తుంది. పురుషుల నుండి స్త్రీలను, భర్తల నుండి భార్యలను ఇలా కలిసి ఉన్న మనుషులను విడదీసే లక్షణం దానిది. మనం స్వాతంత్య్ర పోరాట కాలంలో చూశాం. అష్పఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్లీల్లా వంటి యువతులు జాతీ కోసం ఐక్యం అయి పోరాటం నిర్వహిస్తే అదెంత తీవ్ర పరిణామలకు గురి చేస్తుందా అనేది.”
చారిత్రాత్మక సందర్భంలో, చారిత్రాత్మక స్థలం హైదరాబాద్ లో అష్పఖుల్లాఖాన్ – రామ్ ప్రసాద్ బిస్మిల్లా అమర వీరుల స్ఫూర్తినీ గుర్తుచేసుకుంటూ , ఇవాళ ఈ ఫాసిస్టు సందర్భంలో వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది . దేశాన్ని ఏలుతున్న పాలక వర్గాలు తమ ఫాసిస్టు విశ్వరూపాన్ని రోజు రోజుకు అన్నీ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాసామ్వవాదులుగా, లౌకికవాదులగా మనం మరింత సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా వుంది. హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేకత వుంది. ఈ నేలను ముస్లిం పాలకులు దాదాపుగా 400 ఏళ్లు పాలించిన మతసామరస్యాన్ని నెలకొల్పడంలో తమ శక్తిమేరకు కృషిచేశారని అనేక సాక్ష్యాధారాలు మన కళ్లముందు ఉన్నాయి. కుతుబ్‌షాహీ పాలకుల ఏలుబడిలో అక్కన్న మాదన్నలు పనిచేసిన వుందంతం చరిత్రలో చూడవచ్చు. హిందూ ధార్మిక సంస్థలకు అనేక దానధర్మాలు చేసిన ఘటనలు కూడా ఎన్నో కనిపిస్తాయి మనకందులో. అయితే పాలకులు అన్న తర్వాత వాళ్లకు పెత్తందారీ, ఆధిపత్య విధానం సహజంగానే ఉంటుంది కాబోలు. దానికి తోడు సామ్రాజ్యవాద పాలకుల మెప్పుకోసం అనేక సంస్కరణలకు పాల్పడుతూ సామాన్య ప్రజల మీద భారాలు మోపుతూ, వారిపై పెత్తనం చెలాయిస్తూ, దోపిడీకి, అణిచివేతకు పాల్పడటం ఎక్కడైన జరుగుతుంది. దాన్ని మనం జర్మనీ, యూరోప్ నుండి మొదలుకొని రష్యా, చైనా వరకు అంతటా చూసాం, మన భారతదేశంలోనూ చూస్తున్నాం.
అయితే ఈ తెలంగాణ నేలపై కూడా అటువంటి ఘటననే జరిగింది. దాన్నే మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని చరిత్రలో చదువుకున్నాం. సామన్య రైతాంగం పాలక వర్గాలపై తిరుగుబాటు జెండా ఎగురవేసి వారిని గద్దే దించారు. ఈ పోరాటంతో మహిళలది విడదీయరాని చరిత. నిజానికి మహిళలు లేని పోరాటమే లేదు అనడానికి తెలంగాణ సాయుధ పోరాటం సజీవ ఉదహరణ.! ఆ పోరాటంలో కులాలకు, మతాలకు అతీతంగా మహిళలు పోరాటం నిర్వహించారు. సబ్బండ కులాల పోరాటం అది. ఆ పోరాటం నుండి నేడు ఫాసిజం కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అనుభవాలను గుణపాఠాలను తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఫాసిజానికి ఒక లక్షణం ఉంటుంది. అది మనుషులని విడదీసే లక్షణం. ఒక వర్గాన్ని బుజ్జగిస్తూ ఇంకో వర్గాన్ని అణగదొక్కే విధానాన్ని పాటిస్తుంది. హిందువుల నుంచి ముస్లిములనూ, అగ్ర కులాల నుంచి దళిత బహుజనులను, స్త్రీల నుండి పురుషులను విడదీస్తుంది. పురుషుల నుండి స్త్రీలను, భర్తల నుండి భార్యలను ఇలా కలిసి ఉన్న మనుషులను విడదీసే లక్షణం దానిది. మనం స్వాతంత్య్ర పోరాట కాలంలో చూశాం. అష్పఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్లీల్లా వంటి యువతులు జాతీ కోసం ఐక్యం అయి పోరాటం నిర్వహిస్తే అదెంత తీవ్ర పరిణామలకు గురి చేస్తుందా అనేది. అందుకే అనాడు బెంగాల్‌ను మత పరంగా విభజించాలని బ్రిటీష్ వాడు ప్రయత్నిస్తే, ఇనాడు స్వదేశీ జపం చేస్తున్న ఫాసిస్టు పాలకుడు మత పరంగా విభజించాలని చూస్తున్నాడు.
ఫాసిజానికి ఇంకో లక్షణం కూడా ఉంటుంది. అదే మనకు రూపంలో మంచి చేస్తున్నట్లు అనిపిస్తూనే తీరని నష్టం చేయడం. ట్రిపుల్ తలాక్ విషయంలో దాన్ని చూశాం. ముస్లిం పురుషుడిని నేరస్థుడిని చేస్తూ, ముస్లిం మహిళను ఉద్ధరిస్తున్నట్లు ఫోజులు కొట్టే ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ఆ విధానంలో భాగమే. అయినప్పటికీ పాలక వర్గాల ఫాసిస్టు విధానాలను ఆ వర్గాల మహిళలు గమనించడంతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. హిజాబ్ పేరుతో, ఇంకో పేరుతో ఆ మహిళలను ఇంటికే పరిమితం చేసే కుట్రలకు పాల్పడ్డాడు. సీఎఎ,ఎన్ఆర్సీ విషయంలో మనం చూశాము షాహిన్‌బాగ్ కేంద్రంలో మహిళలు ఎంత క్రీయాశీలంగా పాల్గొన్నారో. నాలుగు గోడల మధ్య పరదా చాటున ఉంటారకున్న మహిళలు పాలకులకు వ్యతిరేకంగా తిరగబడి వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తారని పాలకులు గ్రహించలేకపోయారు. కానీ మహిళలకు తెలుసు ఈ ఫాసిస్టు పాలకులు తీసుకొస్తున్న ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వలన ఎక్కువగా నష్టపోయేది మహిళలేనని. మీకు తెలుసో లేదో అస్సాం కేంద్రంగా సీఏఏ, ఎన్ఆర్సీని అమలు చేసినప్పుడు అక్కడ నష్టపోయిన వాళ్లలో అత్యధిక మంది మహిళలే. అస్సాంలో ఈ పౌరసత్వ సవరణ నుండి తొలగించబడిన వారిలో 70% మంది మహిళలే. పత్రాల ఆధారంగా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం మహిళలకు అత్యంత ప్రమాదకరమైనదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఒక్క పౌరసత్వం విషయంలోనే కాదు పాలకులు అవలంభిస్తున్న ప్రతి విధానంలో అత్యధిక మంది బాధితులు మహిళలే. మీరు గమనించారో లేదో తెలియదు కానీ, దిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిలో కూడ అత్యధికులు మహిళలే. ఈ దేశ వ్యవసాయ రంగంలో ఎక్కువ శాతం మహిళలే పనిచేస్తున్నారు. పాలకుల సంస్కణల మూలంగా, రైతు వ్యతిరేక విధానల మూలంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కనీస మద్దతు ధర (MSP) లేని కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ పెద్ద చనిపోతే తిరిగి ఆ బాధ్యత మొత్తం కూడా మహిళల పైనే పడుతుందనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే ఆ ఉద్యమంలో రైతాంగ మహిళలు ముందు వరుసులో ఉండి చురుగ్గా పాల్గొనడం, ఆ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడటం మనం చూసాం. అటు రైతు ఉద్యమంలో, ఇటు షాహీన్ బాగ్‌లో మరోవైపు అలీఘర్ ముస్లీం యూనివర్సీటీ ఉద్యమంలో మహిళలు, అమ్మాయిలు ముందు వరుసలో ఉండడం పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వాళ్లను అణిచివేసేందుకు తీవ్ర చట్టాలను ప్రయోగిస్తుంది ప్రభుత్వం. చివరకు ఆ మహిళలను జైలుకు పంపడానికి కూడా వెనుకాడలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఫాసిస్టు కోరలు ఎంత పదునైనవో అనేది.
ఎన్ని పోరాటాలు చేసిన, ఎంత కఠినంగా వ్యవహరించిన వెనక్కి తగ్గడం లేదనే కారణంతో మహిళలను లైంగికంగా వేధించడానికి సహితం వెనుకాడటం లేదీ ప్రభుత్వం. ఆ మధ్య కాలంలో ‘బుల్లి బాయ్స్ – సున్నీ డీల్స్’ పేరా, క్లబ్ హౌసుల పేరుతో ముస్లిం మహిళల మీద సోషల్ మీడియా లో ఎంత లైంగిక వేధింపులకు ఎలా గురయ్యారో కూడా మనం చూసాం. మన కళ్ళ ముందు అటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ ఫాసిజానికి మనిషిని మనిషిగా చూసే స్వభావం ఉండదు. అదీ కామన్ సెన్స్‌తో ఆలోచించే గుణాన్ని కోల్పోతుంది. ఇది ఇవాళ కొత్తగా వస్తున్నదేమీ కాదు. తరతరాలుగా ఈ దేశంలోని మెజారిటీ హిందూ భావజాలంలో ఏదో మేరకు పాతుకుపోయి ఉన్న లక్షణమే నేడు విచ్చలవిడిగా, వికృతంగా బహిర్గతం అవుతుంది. గతంలో మనం చూశాం బాలికలకు చదువు చెప్పాలి అని ప్రయత్నించింనందుకు మనువాదులు ఎంతగా రెచ్చిపోయారో. ఫాతిమా షేక్, సావిత్రి బాయి ఫూలేలు బాలికల చదువుకోసం నిలబడినందుకు వారిపై మలం, పేడ విసిరారు. అదే మనువాదులు..వారి వారసులే నేడు రాజ్యాన్ని ఏలుతున్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాదని, మనుస్మతినీ తిరిగి అమలు చేస్తాం అని బాహటంగానే చెప్పుకుంటున్నారు. దానికోసం ఎంతకైనా తెగించడానికి సిద్దపడ్డారు కాబట్టే ఈ ఆరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ ఫాసిజానికి ముందునుండి మహిళలు బాధితులు కాబట్టి భారతదేశంలో ఫాసిజానికి వ్యతిరేకంగా మహిళలు, బాలికలు ముందంజలో ఉన్నారు. కాబట్టి ఆ మహిళలకు అండగా ఉండాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది .
ఫాసిజానికి బంధుత్వం, రక్త సంబంధం అనే మానవత్వ లక్షణం కూడా ఉండదు. అది కన్నవాళ్లను కూడా కడతేర్చే స్వభావాన్ని కలిగిఉంటుంది . దాన్ని మనం జర్మనీలో, ఇటలీలో చూశాము కూడా. జర్మనీలోనూ, యూరప్ లోనూ యూదులు లేకుండా చేయాలని ఫాసిస్టులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి బలవంతంగా యూదులని గెంటివేయడం మొదలుపెట్టారు. అయితే యూదులని పెళ్లి చేసుకున్న జర్మన్ మహిలలతో చిక్కు సమస్య వచ్చిపడింది పాలకులకు. 1935 నాటి న్యూరెంబర్గు చట్టాల ప్రకారం యూదులతో వివాహాలని నిషేధించారు. అప్పటికే జరిగివున్న వివాహాలని రద్దుచేయాని, యూదులను పెళ్లి చేసుకున్న జర్మన్ మహిళలు వెంటనే తమ భర్తలకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. విడాకులు ఇవ్వని జర్మనీ ఆడవాళ్లను చంపడం మొదలెట్టారు. కానీ ఈ ప్రమాధాన్ని పసిగట్టిన జర్మన్ మహిళలు ఎదురు తిరగడంతో నాజీ పాలకులు వెనుకడుగు వేశారు. తమ మహిళలు పెళ్లి చేసుకున్న యూదులను చంపలేదు కానీ అందరినీ ఒక్కచోట చేర్చి నిర్బంధించారు. అలా నిర్భంధించిన వాళ్ల సంఖ్య దాదాపు 30 వేల దాకా ఉంటారని ఒక అంచానా. దీన్ని బట్టి ఫాసిజం ఎంత కర్కషంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఈ ఫాసిజం మన దగ్గర కూడా విస్తరిస్తుంది కాబట్టే కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న మహిళలను, పురుషుల్ని అతీ కిరాతకంగా చంపేస్తున్నారు.
మోదీషాలు అధికారంలోకి వచ్చాక ఇది రోజురోజుకు పెరిగి పోతుంది.”భేటీ బచావ్, భేటీ పడావ్” స్లోగన్ తో గద్దెనెక్కిన ప్రభుత్వం 2014 నుండి 2024 వరకు దాదాపుగా 89,441 గవర్నమెంట్ స్కూల్స్ ని క్లోజ్ చేసిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇందులో వితౌట్ డౌట్ ఎక్కువగా నష్ట పోయేది ఎవరు అంటే మళ్ళీ అమ్మాయిలే, స్థోమత లేని వారు ఆడపిల్లలా చదువులు ఆపేస్తే మళ్ళీ వాళ్ళు ఇంటి పనికి పరిమితమై పోతారు. వంటింట్లో కట్టి పారేసిన కుందేళ్లయి పోతారు. వాస్తవానికి ఈ మనువు వారసులు కోరుకునేది కూడా అదే. మహిళల శరీరాల్ని ఒక క్రీడా స్థలంగా చూసే వీళ్ళకి ఆమే పట్ల కనీస గౌరవం ఉండదు. హత్రాస్ నుండి మొన్నటి మనిషా వరకు మనం చూసాం, ఆడవాళ్ళ శరీరాల పట్ల ఈ బీజేపీ నాయకులు ఎంత క్రూరంగా, ఎంత రాక్షసంగా వ్యవహారించారా అనేది. దళిత, బహుజలనులను అయితే చాలు వాళ్ళని కనీసం మనుషులుగా చూడరు అనేదానికి ఈ ఘటనలన్నీ సజీవ సాక్ష్యాలు. ఆడవాళ్ళనీ కుక్కలతో, పందులతోను పోల్చిన మెంబెర్ లున్నా, అత్యాచారాలు, హత్యలు చేసిన ఎంపీలు, ఏంఎల్ఏ లున్నా ప్రభుత్వం తో మనం ఇంత కన్నా ఏం ఆశించగలం.? ఎన్నో పోరాటాలు చేసి తమ హక్కుల్ని సంపాదించుకున్న నేల ఇది. అలాంటిది ఇప్పుడు, ఈ పాసిజం విస్తృతంగా విస్తరస్తున్న తరుణంలో మనం మౌనంగా ఉండటం అంటే పాముకి పాలు పోసి పెంచినట్లే. అందుకే దీనికి సంఘటితంగా పోరాటం ఒక్కటే మార్గం. మనమంతా ఒక్కటిగా, ఒకదాటికి చేరి, ఆ దిశగా మన కార్యాచరణని కొనసాగించక తప్పదు. అంత ఒక్కటిగా ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేయడమో లేక దాని ఆకలికి బలై పోవడమే నిర్ణయం మీదే.!
-దియా_విఘ్నేష్





