డీఎస్సీ ఎస్జీటీ స్పోర్ట్స్ కోటా రీవెరిఫికేషన్ లో జాప్యమెందుకు ?

అవకతవకలు జరిగాయని కోర్టు చెప్పినా చలనం లేని అధికారులు
చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే జాప్యం చేస్తున్నారా ?
అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని కాపాడే యత్నం
జీఓలో నిబంధనలు మార్చే యత్నంలో అధికారులు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్ లో కొన్ని అక్రమాలు జరిగాయనే అపవాదు మూటకట్టుకుంది స్కూల్ ఎడ్యుకేషన్ మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు స్కూల్ అసిస్టెంట్ కు అర్హులని జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న క్రీడాకారులు ఎస్జీటీ పోస్టులకు అర్హులని నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొంది.  డీఎస్సీ నోటిఫికేషన్ ఆధారంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారు  ఫామ్ 2ని సమర్పించాలని నోటిఫికేషన్ లో  పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 100 పోస్టులకు స్పోర్ట్స్ కోలాలో రిక్రూట్మెంట్ చేపట్టారు. ఇందు కోసం దాదాపు 8,000 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 393 మంది అర్హులుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ధారించారు ఫామ్ సమర్పించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు స్పోర్ట్స్ పార్టీకి పంపించారు. ఇక్కడే అక్రమాలు చోటుచేసుకున్నాయి.  జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న వారు మాత్రమే సమర్పించాల్సిన ఫామ్ 2ను జాతీయ స్థాయి క్రీడాకారులు కాకుండా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్న వారు  కూడా సమర్పించి అప్లై చేసుకున్నారు. ఈ ఫామ్ 2ను సాకుగా చూపించి స్కూల్ ఎడ్యుకేషన్ లోని కొందరు అధికారులు స్పోర్ట్స్ పార్టీలోని మరికొందరు అధికారులు కుమ్మక్కై డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలని కట్టబెట్టారు. కనీసం ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే స్కూల్ ఎడ్యుకేషన్ వారు పంపించిన జాబితా ఆధారంగా 100 పోస్టులకు గాను 33 మందికి ఉద్యోగాల నియామక పత్రాలను అందజేశారు. మిగిలిన పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చి అభ్యర్థులను నింపేశారు స్పోర్ట్స్ కేటగిరీలో అక్రమాలు జరిగాయని గుర్తించిన చాలామంది నియామకాలకు ముందే   విద్యాశాఖ అధికారుల చుట్టూ వెళ్లి పలు ఫిర్యాదులు చేశారు.

నిబంధన మేరకు జాతీయ స్థాయి క్రీడాకారులకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్రస్థాయి క్రీడాకారులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని డబ్బులు చేతులు మారుతున్నాయని ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా హడావిడిగా 33 మందికి పోస్టింగ్ ఇచ్చారు. అన్యాయం జరిగిన చాలా మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో అసలు బాగోతం వెలుగులోకి వొచ్చింది. దొంగ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు పొందినవారి వివరాలను కోర్టుకు సమర్పించడంతో అధికారులు చేరుకొని డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎస్జీటీ రిక్రూట్మెంట్ ని రీ వెరిఫికేషన్ చేస్తామంటూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అందుకు అనుకూలంగానే రీవెరిఫికేషన్ కి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తేదీలను ఖరారు చేశారు. నవంబర్ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల్లో పది మందితో కూడిన స్కూల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్లతోపాటు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన అధికారులతో 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. కానీ లిస్టును మాత్రం ఫైనల్ చేయలేకపోయారు. ఈ వెరిఫికేషన్ లో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగిస్తే తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని అధికారులపై ఒత్తిడి పెరగడంతో వారిని కాపాడే యత్నంలో స్పోర్ట్స్ కోలా జీఓ 74లో ఉన్న లొసుగులను పరిగణలోకి తీసుకునే యత్నం చేశారు నోటిఫికేషన్ ఆధారంగా నియామకాలు చేయాల్సిన నేపథ్యంలో జీఓ 74 ను అడ్డుపెట్టుకుని జాతీయస్థాయి పోటీల్లో కాకుండా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్న వారు కూడా ఉద్యోగాలను కేటాయించవచ్చని అంశం తొమిదికి తీసుకొచ్చి వారి ఉద్యోగాలను కాపాడేందుకు ప్రయత్నం చేశారు ఇక్కడ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరో కమిటీని ఏర్పాటు చేసి మూడోసారి వెరిఫికేషన్ కి నిర్ణయం తీసుకున్నారు.

ఉన్నతాధికారులు .. జనవరి మూడో తేదీ నుంచి ఐదో  తేదీ లోపు మూడు రోజుల్లో సర్టిఫికెట్ల ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి స్పోర్ట్స్ కోటా ఎస్జీటీ పోస్టులను లిస్టును తయారు చేయాల్సిందిగా ఇప్పటికీ 20 రోజులు గడిచిన ఆ లిస్టు తయారు కాకపోవడం వెనుక కారణం ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 మందితో ఏర్పాటు చేసిన కమిటీ కేవలం 13 నుంచి 14 మంది మాత్రమే ఈ పోస్టులకు అర్హులని రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న వారు నోటిఫికేషన్ ప్రకారం అర్హులు కాదని జీవో 74 ప్రకారమే నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్లు మార్చాల్సి ఉంటుందని..  జాతీయస్థాయి పోటీలో పాల్గొన్న వారు మాత్రమే ఎస్జీటీ పోస్టులకు అర్హులని నిబంధనలను మార్చాల్సి ఉంటుందని కమిటీ అభిప్రాయపడిందంట. దీంతో లిస్టు తయారు చేయడం ఆలస్యం అవుతుందని సమాచారం.  అభ్యర్థుల ప్రాధాన్యత లిస్టును తయారు చేసిన తర్వాత జాతీయ స్థాయి క్రీడాకారులను మాత్రమే నోటిఫికేషన్ ప్రకారం పరిగణలోకి తీసుకుంటే 20 నుంచి 22 మంది ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వొస్తుంది.

అధికారులు చేసిన తప్పిదంతో ఈ 20 మంది రోడ్డు మీద పడితే ప్రభుత్వం అభాసుపాలవుతుందనే భయంతో వారి ఉద్యోగాలు పోకుండా కాపాడే యత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న వారి ఉద్యోగాలను కాపాడేందుకు నోటిఫికేషన్ నిబంధనలు మార్చే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయి క్రీడాకారులు కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఉద్యోగంలో ఉంచితే మరో 40 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. ఈ క్రమంలో లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియక సతమతమవుతున్నారట. ప్రాధాన్యత క్రమంలో లిస్టును తయారుచేసి స్కూల్ ఎడ్యుకేషన్ వారిని తుది నిర్ణయం తీసుకోమని ఒక లిస్టు అయితే తయారు చేసినట్లు బయటికి సమాచారం పొక్కింది. దీంతో అసలు ఎవరిని ఉద్యోగంలో ఉంచుతారు. అర్హులకు ఉద్యోగం ఇస్తారా లేక అనర్హులను కాపాడే ప్రయత్నంలో అర్హులకు అన్యాయం చేస్తారా అనేది అర్థం కాని ప్రశ్న. మూడు నెలలుగా అన్యాయం జరిగిన అభ్యర్థులందరూ టెన్షన్ తో ఉంటే దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వాళ్లందరూ దర్జాగా జీతం తీసుకుంటూ టీచర్లుగా చెలామణీ అవుతున్నారని అర్హత కలిగిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *