దిల్లీ సమావేశంలో విజేత ఎవరు?

ఆ క్రమంలోనే నిన్న గాక మొన్న పాలమూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభ్యర్థన బెదిరింపు రెండూ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారని మంచి మనసుతో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు అడ్డుపడ వద్దని కోరారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏకంగా రద్దు చేసుకోమని కూడా కోరారు. అందుకు భిన్నంగా జరిగితే ఎలా సాధించుకోవాలనో తనకు తెలుసని కూడా సవాల్ తరహాలో మాట్లాడారు. బిఆర్ఎస్ నేతల ఎదురు దాడికి ప్రతిగా ఈ సవాల్ చేసి ఉండ వచ్చు.

దిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జరిగింది. తుదకు కేంద్ర ప్రభుత్వమూ తన చేతులకు మట్టి అంటని విధంగా వ్యవహరించింది. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకోండి అన్న చందంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రులే సాంకేతిక నిపుణులు కమిటీ ప్రతి పాదన చేసి ఆమోదించుకున్నారు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ప్రేక్షకుడుగా సమావేశం ఆసాంతం వుండి పోయారు. తెలంగాణ ప్రజల్లో బిజెపి విలన్ కాకుండా జాగ్రత్త పడ్డారు. లేకుంటే కేంద్ర పర్యావరణ శాఖతో పాటు కేంద్ర జల వనరుల శాఖకు చెందిన కేంద జల సంఘం గోదావరి యాజమాన్య బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బనకచర్ల కు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చేవి కావు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి బయలుదేరక ముందే సమావేశం ఎజెండా నుండి బనకచర్లకు అంశం తొలగించాలని సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర జల వనరుల శాఖను కోరి పైకి బింకంగా వ్యవహరించినా ఆచరణలో భిన్నంగా జరిగింది. ముఖ్యమంత్రులు ఇరువురు మధ్య సంవాదం జరిగినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమకు కృష్ణ నదీ జలాలు 289 టిఎంసిలు ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమని చెప్పారంటే బనకచర్లను ఎరగా వేయడం తప్ప వేరు కాదు. గోదావరి నదిపై తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా తాము అడ్డుపడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభ్యర్థన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉందంటే చల్ల కొచ్చి ముంత దాచిన విధంగా వుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల అనుసంధానానికి అడ్డ తొలగించుకొనేందుకు సిద్ధమై సమావేశానికి వస్తే బనకచర్ల ఆశ చూపి కృష్ణా నదిపై ఉన్న పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు ఆంధ్ర ప్రదేశ్ అడ్డు పడకుండా చూచు కోనేందుకు దిల్లీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బలహీనతనే బిఆర్ఎస్ నేతలు బట్ట బయలు చేస్తే వాస్తవంలో కేంద్ర జల వనరుల శాఖ విడుదల చేసిన ప్రకటనలో బనకచర్ల అంశం లేక పోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదుకొన్నది. ఆ క్రమంలోనే నిన్న గాక మొన్న పాలమూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభ్యర్థన బెదిరింపు రెండూ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారని మంచి మనసుతో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు అడ్డుపడ వద్దని కోరారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏకంగా రద్దు చేసుకోమని కూడా కోరారు. అందుకు భిన్నంగా జరిగితే ఎలా సాధించుకోవాలనో తనకు తెలుసని కూడా సవాల్ తరహాలో మాట్లాడారు. బిఆర్ఎస్ నేతల ఎదురు దాడికి ప్రతిగా ఈ సవాల్ చేసి ఉండ వచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ కు చెంది బనకచర్ల అనుసంధానం పథకం ఏతావాతా తేలిన దేమంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనకు వెళ్లే ముందు బనకచర్ల అంశం దిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు వెళుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ మీడియాలో వచ్చింది. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా నదిలో 289 టీఎంసీల నీళ్లు తెలంగాణకు ఇస్తారని ఎవరైనా ఊహించ గలరా? గోదావరి వరద జలాల కోసం కృష్ణా నదిలో నికర జలాలు వదులు కొనేంత అమాయకుడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? గతంలో కేసీఆర్ తో అలాయ్ బలాయ్ ఆడిన జగన్మోహన్ రెడ్డి రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ కు ఆమోదం తెలిపి ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి రంగాన్ని బలి పీఠం ఎక్కించారనే అపప్రథ మూట గట్టుకున్న పూర్వ రంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెత్త బడే అవకాశాలు ఉండవు.

ఒక పక్క కృష్ణ నదీ జలాల పంపిణీకి నియమింపబడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నియామకమే చట్ట విరుద్ధమని ఆంధ్ర ప్రదేశ్ సుప్రీంకోర్టులో వాదిస్తోంది. పైగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లకు గండి పడకుండా ట్రిబ్యునల్ లో పోరాడేందుకు సన్నాహాలు చేస్తోంది. పైగా పోలవరం నుండి కృష్ణలో కలిసే 80 టిఎంసిల్లో ఎగువ రాష్ట్రాలకు 35 పోగా మిగిలిన 45 టిఎంసి ల్లో వచ్చే వాటా నుండి తమకు ఇవ్వాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వదులు కుంటారా? ఇదిలా ఉండగా అసలు ముఖ్యమంత్రుల సమావేశం తన సూచన మేరకే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ఏర్పాటు చేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రహస్యం విప్పారు. తమకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు అవసరమేనని తాము ఎవరి పక్షం వహించడం లేదని కుండ బద్దలు కొట్టారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన బట్టి పరిశీలించితే ప్రస్తుతం తెలంగాణలోని అధికార ప్రతి పక్షాలకు తోడు కేంద్ర జల వనరుల శాఖ కు చెందిన చట్ట బద్దత గల సంస్థలు కేంద్ర జల సంఘం గాని గోదావరి యాజమాన్యం బోర్డు గాని తుదకు పోలవరం అథారిటీ తాము తీసుకున్న వైఖరి నుండి మినహాయింపు ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. పైగా సాంకేతిక నిపుణులు కమిటీ ఎజెండాలో బనకచర్ల అంతిమంగా జత పర్చినా ఈ కమిటీ కూడా చేయగలిగిందేమీ లేదు . ఏకాభిప్రాయం ఉన్న అంశాలు తప్ప వివాదాంశాల్లోనూ విధాన పరమైన అంశాల్లోనూ నిపుణులు కమిటీ నిస్సహాయంగా ఉండక తప్పదు. అంతిమంగా బనకచర్ల అపెక్స్ కౌన్సిల్ కు రావలసినదే. అపెక్స్ కౌన్సిల్ లో ఏం జరిగేది ఇప్పుడే చెప్ప వచ్చు.

-వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *