“కాంగ్రెస్‌లో రేవంత్ అధిపత్యం కొనసాగాలన్న, తనకు రాష్ట్రంలో బలం తగ్గలేదని నిరూపించుకోవాలన్న, సీఎం కుర్చిని మరింత కాలం కాపాడుకోవాలన్న, మంత్రులను కంట్రోల్ చేయాలన్న,తనపై వొస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించుకోవాలన్న రేవంత్‌కు జూబ్లీహిల్స్‌గెలుపు చాలా అవసరం..అదే విధంగా అటు బీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా లుకలుకలు బయటపడుతున్నాయి..పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో పవర్ షేరింగ్ విభేదాలు సమసిపోయి కేటీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్ నాయకుడని ఎస్టాబ్లిష్ కావాలన్న ఉప ఎన్నిక గెలుపు బూస్ట్‌లాంటిది. అందుకే అటు రేవంత్ ఇటు కేటీఆర్ బై పోల్‌ను చావో రేవో అన్నట్లు తీసుకున్నారు..ఏ పార్టీ గెలిచిన కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో సంస్థాగతంగా మార్పులు అయితే స్పష్టంగా కనిపిస్తోంది.”
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించిన హీట్ ను రాష్ట్రంలో పుట్టిస్తుంది.. అధికార విపక్షాలు గత వారం రోజులుగా జూబ్లీహిల్స్ లోనే మకాం వేశాయి..ఉప ఎన్నిక ప్రచారం మొంథా తుపాను సృష్టించిన విధ్వంసాన్ని కొట్టుకుపోయేలా చేసింది..మొంథా బీభత్సంతో రెండు రోజులు రాష్ట్రం వరదలతో అతాలాకుతలమై చేతికొచ్చిన పంట నీళ్ళ పాళ్లు కావడంతో రాష్ట్రంలో ఒక రకమైన భీత వాతావరణం నెలకొంది..ప్రజల ఆందోళనలు, అన్నదాతలు ఆక్రందనలతో భయంకరమైన పరిస్ధితిలో కూడా అధికార విపక్షాలు జూబ్లీహిల్స్ బై పోల్ పైనే ఫోకస్ చేశాయి.. ఒకవైపు వర్షాలు వరదలతో తెలంగాణ ప్రజలు పుట్టేడు కష్టంలో ఉంటే.. పాలకులు ఒక్క ఉప ఎన్నికల్లో గెలుపు కోసం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార వర్గం జూబ్లీహిల్స్ లోనే మకాం వేశాయి.. చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని అన్ని ఉన్న అనాధగా మార్చి ఉప ఎన్నిక ప్రచారం కోసం ప్రాధాన్యత ఇచ్చారు..ఒక ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.. సహజంగా రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చిన సీఎం ఒక సభనో..ఒక రోడ్ షోనో సీఎం చేసే వారు కానీ జూబ్లీహిల్స్ బై పోల్ లో రాష్ట్రంలో అన్ని సమస్యలను పక్కన బెట్టి సీఎం ఏకంగా నాలుగైదు రోజులు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు పెట్టడం ఇదే తొలిసారి.
రకరకాల కారణాలతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం సహజం.. గతంలో ప్రస్తుతం భవిష్యత్తులో ఉప ఎన్నికలు సాధారణం.. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం నెవ్వరు భిఫోర్ ఎవ్వరాఫ్టర్ అన్నట్లు జరుగుతుంది.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం.. అధికార కాంగ్రెస్ కు తమ రెండేళ్ల పాలనకు లిట్మస్ టెస్ట్.. బీజేపీ తామ బలం పెరిగిందని, అర్బన్ వోటర్లు తమతోనే ఉన్నారని చెప్పుకునేందుకు మాడు పార్టీలకు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకమే.
జూబ్లీహిల్స్ బై పోల్ లో ఏ పార్టీ గెలిచిన ఇప్పటికిప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల ఆలోచనల్లో ఒక తాత్కాలిక అభిప్రాయాన్ని ఏర్పరిచిన.. ప్రభుత్వాలు తారుమారు అయ్యే అవకాశాలు లేవు..అధికార పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం వస్తుంది..ఓడిపోతే ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు, ప్రజల వ్యతిరేక ఏ స్థాయిలో ఉందో సమీక్ష చేసుకుని వైఫల్యాలను అధిక మించే అవకాశాలు ఉంటాయి.
ప్రతి పక్ష బీఆర్ఎస్ గెలిస్తే, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి ఒత్తిడి నుంచి బయటపడవచ్చు..ఆ పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ వస్తుంది.. ప్రతి పక్షం గెలుపు ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేక ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చిన హామీలు అమలు చేసే విధానంగా ఒత్తిడి పెంచవచ్చు. అయితే అధికార పార్టీ గెలిస్తే కొత్తగా సమీకరణాలు ఏమీ మారవు.. ఉన్న పథకాలు అమలు చేసేందుకు అనేక ఆర్థిక రాజకీయ ఇబ్బందులు, ఆపసోపాలు పడుతున్న అధికార పార్టీ కొత్త పథకాలు అమలు చేస్తుందన్న ఆశలు కూడా పెద్దగా లేవు.కానీ కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ప్రచారం చేసుకోవచ్చు..దీంతో అధికార పార్టీలో అహంకారం పెరుగుతుంది..ఏం చేసినా ప్రజలు పట్టించుకోరన్న అహం పెరుగుతుంది.. గతంలో అనేక ఉప ఎన్నికల్లో అధికార పార్టీలో ఇలాంటి పరిస్థితులు కనిపించాయి.
అయితే ప్రతి పక్షానికి ఇది సిట్టింగ్ స్థానం కావడంతో.. అందులోనూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు కావడంతో అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకతను ఏకీకరణ చేయడానికి బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..అదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండటంతో విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి.ఈ ఒక్క గెలుపుతో రాజకీయాల్లో సంచలన మార్పులేవి ఉండవు కానీ ఆ గెలుపు ఉత్సాహం త్వరలో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది.. అందుకే జూబ్లీహిల్స్ బై పోల్ గెలుపు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో గెలుపును డిసైడ్ చేసే అవకాశం ఉండటంతో విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం సీఎం రేవంత్ రెడ్డికి చాలా కీలకం..బైల్ పోల్‌పై కాంగ్రెస్ కంటే రేవంత్ కు ప్రతిష్టాత్మకం కానుంది. ఉప ఎన్నికపై ఏఐసీసీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఫలితాలు తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణియిస్తుందన్న లేవల్‌లో రేవంత్ రెడ్డి బైపోల్‌పై ఫోకస్ పెట్టారు.
మొదట ఉప ఎన్నికపై అంటి ముట్టనట్లున్న ముఖ్యమంత్రి రేవంత్..కర్నాకటలో మారుతున్న రాజకీయ పరిణామాలు, బీహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని హైకమాండ్ దూరం పెట్టడంతో జూబ్లీహిల్స్‌పై దృష్టి పెట్టారు..సిని కార్మికులతో సభ, వరుస రోడ్ షోలతో కాలుకు బలపం కట్టుకుని రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం మొదలు పెట్టారు. రాష్ట్రముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సమస్యల కంటే జూబ్లిహీల్స్ ఎన్నికపైనే రేవంత్ ఎక్కువ ఫోకస్ పెట్టారు.
రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక ఎప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్చే స్థాయిలో ఉండదు.ఒక్క ఎన్నికలో గెలుపోటములతో సర్కార్ కూలిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండదు..కానీ జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వాలు మారిపోతాయన్న స్థాయిలో సీఎం ప్రచారం చేస్తున్నారు. అటు ప్రతిపక్షం కూడా ఇది ప్రభుత్వాన్ని మార్చే ఎన్నిక కాదు, ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఎన్నిక అంటూ ప్రచారం చేస్తుంది..అయితే రేవంత్ రెడ్డి పర్సనల్‌గా తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతుంది. సీఎంగా రెండేళ్ల పాలన, రేవంత్ రెడ్డి పనితీరుకు ఇది తొలి పరీక్ష అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రేవంత్ ప్రచారం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో హస్తం ఓడిపోయింది. సొంత జిల్లా, సొంత ఎంపీ స్థానాల్లో పరాజయం పాలైంది.
ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి రెండేళ్ళు కావడంతో రేవంత్ రెడ్డికి ఇది లిట్మస్ టెస్ట్ లాంటిందే..తప్పగా గెలవాల్సిన అవసరం రేవంత్‌కు ఉంది. తన పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలంటే రేవంత్ కు జూబ్లీహిల్స్ బై పోల్ డూ ఆర్ డైలాంటిదే. అంతేకాదు పార్టీలో ప్రభుత్వంలో మంత్రులు మధ్య విభేదాలు, సీఎంపై నేతల కంప్లైట్స్, పాలన చేతగావడం లేదన్న అభిప్రాయాలకు చెక్ పెట్టాలన్నా, హైకమాండ్ విశ్వాసం కొనసాగించాలన్న సీఎంకు ఈ ఉప ఎన్నిక ఒక రెడ్ లైన్ వంటిది.మరోవైపు జూబ్లీహిల్స్ బై పోల్ ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మం..ఈ ఫలితం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే జీహెచఎంసీ ఎన్నిలకు కూడా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్‌కు ఇంకా మూడేళ్ల పదవి కాలముంది..ఇంత త్వరగా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చేధు అనుభవం ఎదురవుతుంది.
ఈ నేపథ్యంలోనే పార్టీ తన చేతుల్లోంచి జారిపోతుందని, ప్రభుత్వంలో తన ఆధిపత్యం తగ్గుతుందన్న ఆందోళన రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది.రాష్ట్రంలో ఢిల్లీలో తన ప్రభాల్యం మళ్లి పెరగాలంటే జూబ్లీహిల్స్‌లో గెలిసి తీరాల్సిన చావో రేవో పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి అజారుద్దీన్‌కు టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే..ఇప్పుడు హైకమాండ్ ఏకంగా మంత్రినే చేసింది. దీంతో రేవంత్‌లో పదవిగండం భయం పట్టుకుందన్న చర్చ జరుగుతుంది. బీహార్‌లో ఫలితాలు, కర్ణాటక లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఫలితం రేవంత్ రెడ్డి సీఎం కుర్చికి ఎర్త్ పెట్టుతుందన్న ఆందోళన అయితే రేవంత్ లో కనిపిస్తుంది.
.ఈ క్రమంలో సీఎం తన ప్రచారాన్ని సాధారాణ ఎన్నికల తరహాలో నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోయాని ప్రచారం చేస్తున్నారు..సహజంగా ఉప ఎన్నికలో ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం అమలు చేస్తామని చెప్పాలి..గెలిపిస్తే ప్రత్యేకంగా నియోజకవర్గానికి అభివృద్దికి కృషి చేస్తామని సీఎం స్థాయి వ్యక్తి చెప్పాలి..కానీ ప్రతిపక్షం గెలిస్తే పథకాలు ఆగిపోతాయంటే సీఎం తన బలహీనతను బయపెట్టుకుంటున్నారు.
.ఉప ఎన్నికతో ప్రభుత్వం మారిపోతుందనే చెప్పడం కాంగ్రెస్‌కు డ్యామేజ్ చేస్తుంది. కనీసం బై పోల్‌లో ఓడిపోతే సంక్షేమ పథకాలు ఎందుకు రద్దైతాయో తెలియని అజ్ఞానంలో సీఎం మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షం గెలిచిన నియోజకవర్గంలో పథకాలు ప్రభుత్వం కావాలనే అమలు చేయడం లేదా అన్న అనుమాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇది వోటర్లను బెదిరించే ప్రయత్నమే అవుతుంది.అటు బైపోల్ లో కూడా రేవంత్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన ఆరోపణలే తప్ప కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు..కాంగ్రెస్ రెండేళ్ల నుంచి ఆరోపణలు నిరూపించింద అంటే అదీ లేదు. అసలు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడమే లేదు.
ఇక రేవంత్ రెడ్డి ప్రచారంలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ కాంగ్రెస్ పరువు తీస్తున్నారు.ఆజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎవరో అడ్డుకుంటున్నారు అంటూ చెపుతున్నారు. రెండేళ్ల నుంచి మైనార్టీలకు మంత్రి వర్గంలో ఎందుకు అవకాశం ఇవ్వలేదంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు అజారుద్దీన్ వరల్డ్ కప్‌కు నాయకత్వం వహించారు తెలంగాణాభివృద్దికి నాయకత్వం వహించరా అంటూ ప్రజలను ప్రశ్నించిన తీరు తిరిగి కాంగ్రెస్‌కే బూమరాంగ్ అవుతుంది. కనీసం అవగాహన లేకుండా సీఎం ప్రచారం చేయడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ పరోక్షంగా ఎలా కారణమయ్యారో..జూబ్లీహిల్స్‌లో కూడా కారణం అవుతారా అన్న టెన్షన్ కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తుంది.
ఇంకోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా జూబ్లీహిల్స్ ఫలితం తన నాయకత్వానికి లిట్మస్ టెస్ట్ కానుంది. ఉప ఎన్నికలో గెలిస్తే పార్టీలో కేటీఆర్ స్థాయి మరింత పెరుగుతుంది..ఒక వేళ ఓడిపోతే దాని ప్రభావం బీఆర్ఎస్ లో కేటీఆర్ ప్రాధాన్యత కొంత తగ్గే అవకాశం లేకపోలేదు. ఒక్క ఉప ఎన్నికతో పార్టీలో నాయకుడి స్థాయిని అంచన వేయవచ్చా అంటే వేయలేం, కానీ ఇక్కడ ఉప ఎన్నిక రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లు సాగుతుంది.
కాంగ్రెస్‌లో రేవంత్ అధిపత్యం కొనసాగాలన్న, తనకు రాష్ట్రంలో బలం తగ్గలేదని నిరూపించుకోవాలన్న, సీఎం కుర్చిని మరింత కాలం కాపాడుకోవాలన్న, మంత్రులను కంట్రోల్ చేయాలన్న,తనపై వొస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించుకోవాలన్న రేవంత్‌కు జూబ్లీహిల్స్‌గెలుపు చాలా అవసరం..అదే విధంగా అటు బీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా లుకలుకలు బయటపడుతున్నాయి..పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో పవర్ షేరింగ్ విభేదాలు సమసిపోయి కేటీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్ నాయకుడని ఎస్టాబ్లిష్ కావాలన్న ఉప ఎన్నిక గెలుపు బూస్ట్‌లాంటిది. అందుకే అటు రేవంత్ ఇటు కేటీఆర్ బై పోల్‌ను చావో రేవో అన్నట్లు తీసుకున్నారు..ఏ పార్టీ గెలిచిన కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో సంస్థాగతంగా మార్పులు అయితే స్పష్టంగా కనిపిస్తోంది.
-తోటకూర రమేష్





