హైదరాబాద్ ఎయిర్ పోర్టు అయిదు వేల ఎకరాల నుండి నిర్వాసుతులైన రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కూలీలు వ్యవసాయ ఆధారిత వృత్తులు చేసుకునే బ్రతికే ప్రజలంతా ఎక్కడున్నారు. 30 వేల మంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులు వారి సమస్యల పై పోరాటం చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపుకు గురి అయిన ప్రజలెక్కడ.. వాళ్ల పిల్లలు ఎక్కడ.. వాళ్ళు ఇప్పుడు ఎం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల్లో విషవాయువులు పీల్చిన పటాన్ చేరు ప్రాంత నివాసులు ఎక్కడున్నారు. హైటెక్ సిటీ రంగారెడ్డి జిల్లాల మూలవాసులైన రైతులు రైతు కూలీలు ఎక్కడున్నారు… వ్యవసాయ భూముల స్థానంలో తళతళ మెరిసే బంగాళాలు, విల్లాలు ఐటి కంపెనీల కార్యాలయాలు కొందరు న్యూయార్క్ అంటే కొందరు డల్లాస్ అని మురిసి పోవడం కూడా చూసాము. ఈ మెరిసే పట్టణం కు కారకులైన భూ నిర్వాసితులు ఎక్కడున్నారు. .అభివృద్ది జరుగలేదా సంపద సృష్టింప బడుత లేదా అంటే జరిగిన మాట వాస్తవం. కానీ ఈ అభివృద్ధి నమూనా లో భూములను, వృత్తులను కోల్పోయిన ప్రజలు ఎక్కడ ఉన్నారు అనేదే ప్రశ్న.
ఈ తళతళ మెరిసే ఆఫీసులలో కొలువులు చేస్తున్నారా అనే ప్రశ్న. వేయ వలసిందే . చాలా మంది నిర్వాసిత కుటుంబాలు అదే స్థలం లో వెలిసిన పెద్ద పెద్ద బంగ్లా ల్లో వాచ్ మెన్ లు గా, మహిళలు గృహ కార్మికులుగా మారి పోయారు. ఈ అభవృద్ది మోడల్ లో రాష్ట్రానికి ఆదాయం పెరిగిన మాట వాస్తవమే కావచ్చు. వాటితో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండా వచ్చు. అవన్నీ పేదలను ప్రభుత్వాల మీద అధికారుల మీద ప్రజాప్రతినిదుల మీద ఆధారపడే విధంగా చేస్తుంది .అభివృద్దిలో హక్కుగా భాగ్యస్వామ్యం చేయకుండా ఆధార పడే పౌరులుగా మార్చేస్తుంది ఈ అభివృద్ది నమూనా. మరో వైపు ఈ అభివృద్ది నుండి పెరిగిన ఆదాయం ప్రజాప్రతినిధుల జీతాలు ప్రభుత్వ అధికారుల జీతాలు పెంచు కోవడానికి, అధికార దర్పణానికి తమ నివాసలకు కార్యాలయాలను ఆధుని
అనేక దశాబ్దాలుగా ప్రణాళికలు రచించినవారు అనుసరిస్తున్న అభివృద్ది నమూనా కూడా ఇదే . ఈ పేరుతో ఖనిజ తవ్వకం, ఆనకట్టలు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇటీవల కాలం లో హైవేలు మెట్రోలు ,ఫార్మా సిటీలు ,ఎస్ ఈ జెడ్ లు, హైటెక్ పార్కులు మొదలైన వాటి ద్వారా జరిగిన నిర్వాసితుల కు జరుగుతున్న అన్యాయాల పై పాఠాలు నేర్చుకోలేదు. పలు చోట్ల నిర్వాసితుల సమస్యలు ఇంకా పరిష్కారమవ్వలేదు.
తాము అనుకున్న అభివృద్ధి నమూనా లో త్యాగం చేయాలని త్యాగాలు చేస్తే ఫలితాలు ‘ట్రికిల్ డౌన్’ (మెల్లగా దిగజారడం) అయ్యి ఆ ప్రాంత సామాన్యులకు కూడా అందుతాయని స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తారు. అభివృద్ధి అనే ప్రక్రియలో, కొంతమంది త్యాగం చేయాలన్నది ఈ సిద్ధాంతం. ఈ త్యాగాన్ని చేయాల్సినవారు సాధారణంగా పేదలే అవుతారు. ఈ అభివృద్ధి మోడల్ సహజంగానే పేదలను వెలివేసేలా తయారవుతుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి . రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జరిగిన జరుగుతున్న నిరసన ఉద్యమాలు కూడా ఇదే విషయాన్ని చూపుతున్నాయి.
పేదలు తమ వనరులను ఆక్రమణ నుండి కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం సుదీర్ఘమైనది, కష్టమైనది. ప్రారంభంలో, అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారిని తిరిగి పునరావాసం చేయవచ్చని నమ్మారు. కానీ అది సాధ్యం కాదని తేలింది. రాష్ట్రం లో వివిధ ప్రాంతాలలో ప్రజలు పునరావాసం కోసం చర్చలు జరిపే బదులు, తాము వనరులను కాపాడుకోవాలని, అభివృద్ధి ప్రాజెక్టులను తిరస్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అసురక్షితంగా, సంఘర్షణతో నిండినవిగా మారాయి. అభివృద్ధి పేరు మీద అవసరాలకు మించి వేల ఎకరాలు సేకరించడం… సేకరించిన భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపు అందుకోవచ్చు కానీ స్థానిక ప్రజలకు ఉపాధి దొరకదని తెలుస్తూనే ఉంది. భూముల ధరలకు రెక్కలొచ్చి సామాన్య రైతులు వ్యవసాయ భూములను కొనుక్కునే స్తోమతను తగ్గించి వేస్తుంది.
అభివృద్ధి మరియు పేదలు ఇప్పుడు వ్యతిరేక ధృవాలలో ఉన్నాయి.
ప్రజలు ఎప్పడు అభివృద్ధిని కాంక్షించే వారే. కానీ ఎటువంటి అభివృద్ధి నమూనా ను అవలంబించాలి అనేది ప్రశ్న . అభివృద్ధి రాష్ట్రం లో కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కేంద్రీకరించ కూడదు . అన్ని జిల్లాలలో అభివృద్ధిని చేయాలి. వికేంద్రీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం . రాజ్యాంగ బద్దంగా గ్రామ పంచాయితీల కు ,స్థానిక ప్రభుత్వాలకు (మండల ,జిల్లా పంచాయితీలు)సంక్రమించిన అధికారాలను గౌరవించి వారి భాగస్వాస్వామ్యం చాలా ముఖ్యం. అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం అతి ముఖ్యం. నిర్ణయాలు తీసుకుని పౌరులను పాటించమని చెప్పడం కాదు . నిర్ణయాలలో భాగస్వామ్యం చేయాలి. అభివృద్ధి ఫలాలు ఆ ప్రాంత ప్రజలకు అందుతున్నాయ అనేది ప్రధాన చర్చ జరగాలి. వాయు కాలుష్యం,పర్యావరణ వినాశనం ప్రాజెక్టులను అనుమతించరాదు. ప్రజా పాలన పేరుతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆయన మంత్రివర్గ సహచరులు తన మదిలో నచ్చిన అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో ఏకాభిప్రాయం సాధించి ప్రజలను భాగస్వామ్యం చేయాలి.

సామాజిక కార్యకర్త





