1995 నాటి చంద్రబాబు నాయుడు ఎక్కడ?

ఆ మధ్య జరిగిన జిల్లా కలెక్టర్ల రెండవ సమావేశంలో 1995 నాటి చంద్రబాబు నాయుడును ఇక మీదట చూస్తారని ముఖ్యమంత్రి చెప్పడం ఉత్తుత్తిదేనా? ఈ హెచ్చరిక అధికారుల కేనా? ఆ సమ యంలో మంత్రులు కూడా వున్నారు. ఒకవేళ అధికారులకే అనుకున్నా జిల్లాల్లో ఆకస్మిక తనిఖీల పోబిడి లేదు. అయితే మరల జరిగిన జిల్లా కలెక్టర్ల మూడవ సమావేశంలో అధికారుల యెడల ముఖ్యమంత్రి కొంత కరుకుగా మాత్రం వ్వవహ రించారు. 1995 నాటి చంద్రబాబు నాయుడుకు ఆ మసాలా సరి పోదు. మొత్తం తన ప్రభుత్వ మనుగడ సురక్షితంగా వుండేందుకు ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా వర్తించి హెచ్చరిక జారీ చేసి వుంటే ఆ జాడ కూడా లేదు. ఆంధ ప్రదేశ్‌ లో ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి అక్రమాలపై ప్రతి పక్షానికి చెంది కాకుండా టిడిపి అనుకూల మీడియాలో నిత్యం నెగిటివ్‌ వార్తలు రావడం రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. మరీ జిల్లా ఎడిషన్లలో పుంఖానుపుంఖంగాఈ తరహా వార్తలు వస్తున్నాయి. ఇసుక మద్యం ప్రధాన ఎజెండాగా వుంది.
ఎంత ధైర్యం దన్నూ లేనిదే.

గోదావరి నది నుండి ఇసుక తరలించేందుకు రోడ్డు నిర్మించుతారు?
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి ఆలయం ఎదురుగా స్వర్ణ ముఖి నదిలో అర్థ రాత్రి జెసిబి పెట్టి భక్తులను భయభ్రాం తులను చేస్తూ ట్రాక్టర్లతో ఇసుక తరలించడంపై ఒక దినపత్రిక లో వార్త వచ్చినా అధికారులు నిద్ర పోతున్నారంటే ఏమనాలి? మరొక పుణ్య క్షేత్రం తిరుచానూరు ఆలయం పక్కనే స్వర్ణ ముఖి నదిలో రోడ్డు వేస్తుంటే ఆధికారులు ఏం చేస్తున్నట్లు? మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత అధికారులు వెళతారా? పోనీ అధికారులు ఈ సందర్భంగా ఎంత మందిపై కేసులు నమోదు చేశారు? అధికారులు తీరు ఇలా వుంటే మరీ కొంత మంది ఎమ్మెల్యేల వ్యవహార సరళిపై ముఖ్యమైన ఎలక్ట్రానిక్‌ మీడియా లో వార్తలు ప్రసారం కావడంతో పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ప్రతి పక్షానికి చెందిన మీడియాలో వస్తున్న నెగిటివ్‌ వార్తలు ఎవరూ పట్టిం చుకోవడం లేదు. టిడిపి అనుకూల మీడియాలో ఎమ్మెల్యేలు మంత్రులపై వస్తున్న నెగిటివ్‌ వార్తలపైన ముఖ్యమంత్రి నుండి గాని కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా పిలిచి మాట్లాడి హెచ్చరిక చేయడం లేదనే ఆందోళన కూడా వ్యక్తమౌతోంది. ఒకరిద్దరి హెచ్చరికలు మీడియాలో వస్తే ఇతరులు అవినీతి అక్రమాలకు తలపడటానికి భయ పడు తామనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

1995 నాటి చంద్రబాబు నాయుడు పాలనలో ఇందుకు భిన్నంగా జరిగింది. జిల్లా కలెక్టర్ల రెండవ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన 1995 నాటి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏలా వ్యవహరించే వారో పరిశీలిద్దాం!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతహాగా శ్రమైక జీవి. పరిపాలనాధ్యక్షులు. ఇవే చంద్రబాబు నాయుడు ను నాలుగు దశాబ్దాలుగా అలుపెరగకుండా మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయ రంగంలో నిలబెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం వైవిధ్యంతో కూడు కొన్నదే గాక వైరుధ్యంతో కూడా మిళితమై వుంటుంది. 1995లో ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయానికి చంద్రబాబు నాయుడు నడి వయసులో వున్నారు. ఉద్యోగ రీత్యా కన్నా ఆత్మీయత పైగా అంత రంగం ఎరిగిన ఇద్దరు ముగ్గురు అధికారులు ముఖ్యమంత్రి పేషీలో ముఖ్య భాధ్యతల్లో అధికారులుగా వున్నారు. ఓయస్డీగా ఐఎఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఒకరైతే ముఖ్యమంత్రి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారి (సిపిఆర్‌ఓ) విజయ కుమార్‌ మరొకరు. వీరికి తోడు బాల సుబ్రమణ్యం వుండనే వున్నారు. సతీష్‌ చంద్ర లాంటి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు పేషీలో వున్నా కీలక మైన పాత్ర లక్ష్మి నారాయణదే.తెల్ల వారు రమున అయిదు గంటలకు నిద్ర లేచే సిపిఆర్‌ఓ విజయకుమార్‌ రాష్ట్రంలోని ముఖ్య దిన పత్రికలన్నీ ఏ రోజుకు ఆరోజు తిరగేసి ప్రభుత్వ వ్యతిరేక వార్తలతోపాటు పార్టీ ఎమ్మె ల్యేలు నేతలు ఏదైనా అవినీతి అక్రమాలకు పాల్పడిన వార్తలు క్రోడీకరించి సరిగ్గా 7.30 గంటల కల్లా చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకొనే వారు.

చంద్రబాబు నాయుడు కూడా ముందు రోజు రాత్రి పొద్దు పోయేంత వరకు అధికారిక కార్యక్రమాల్లో వున్నా పర్యటన నుండి అర్థరాత్రి వచ్చినా ఎంత ఆలస్యమైనా ఉదయం ఎనిమిది గంటలలోపే సిపిఆర్‌ఓ విజయ కుమార్‌ను బ్రీఫింగ్‌కు తన ఆఫీసు గదిలోనికి పిలిచే వారు. ఇంత కథనం ఎందుకంటే ఈ బ్రీఫింగ్‌లో ఎజెండాగా తయారైన ఎమ్మెల్యేలు గాని పార్టీ నేతలు గాని రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు ముందు హాజరై సంజాయిషీ ఇచ్చుకొనే వారు. మరోవేపు సిపిఆర్‌ఓ విజయ కుమార్‌ పత్రికల వారికి లీకులు ఇచ్చే వారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలనుగాని నేతలను గాని క్లాస్‌ తీసుకున్న వార్త మీడియాలో రావడంతో అవినీతి అక్రమాలకు పాల్ప డాలంటే ఇతరులు భయపడే వారు.ఐఎయస్‌ అధికారుల అం శంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కఠినంగా వున్న సందర్బా లున్నాయి.

టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గా వుండిన ఒక ఐఎఎస్‌ అధికారిని బ్రహ్మోత్సవాలకు ముందు బదలీ చేశారు. అయితే పలువురు కనీసం బ్రహ్మోత్సవాల వరకు బదలీ నిలుపుదల చేయమని కోరినా అంగీకరించ లేదు. ఇదీ ఆనాడు ఐఎఎస్‌ అధికారులు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల యెడల చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు.మరో వేపు ప్రజలవద్దకు పాలనపేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు ఆకస్మిక తనిఖీలు చేసే వారు. ఏ జిల్లాకు వెళుతున్నారో తెలిసేది కాదు. ఒక వేళ ఏ టవున్‌ చేరుకున్నా ఎక్కడికి వెళుతున్నారో జిల్లా కలెక్టర్‌ కు కూడా తెలిసేది కాదు. ఇందు వలన రెండు విధాలుగా ఫీడ్‌బ్యాక్‌ లభ్యమయ్యేది. క్షేత్రస్థాయి అధి కారుల పని తీరుతో పాటు ప్రభుత్వ పని తీరు గురించి ప్రజల స్పందన తెలిసేది.వీటితో పాటు ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరు అవగతమయ్యేది. ఇదీ జిల్లా కలెక్టర్ల రెండవ సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పిన 1995 నాటి పరిపాలన.
వి. శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *