మన దేశంలో మిగితా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం, కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తదని, గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా, ప్రాణాలు పణంగా పెడితే ఆ త్యాగల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి,అది వారి హక్కు కూడా. కానీ ఈ పదేండ్లలో సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? ఉద్యోగాలు అందరికి దక్కాయా? అంటే కాదనే చెప్పాలి? మేం ఎన్నో కలలు కన్నాం,తెలంగాణ వస్తే లక్షలాది ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడి నుండి వెళ్ళిపోతే అందరికి ఉద్యోగాలు దక్కుతాయని ఆశించాం. ఇగ ఇంటికో ఉద్యోగం అని ఉద్యోమంలో ఉద్యమ నాయకులమని చెప్పుకునే వాళ్ళు ఉర్రుతలాడించినారు. ఇగ స్వయానా ఉద్యమకారుడైనా కేసీఆర్ ముఖ్య మంత్రి కావడంతో అస్సలు తెలంగాణలో నిరుద్యోగం అనే పదమే ఉండదని అనుకున్నాం.
ఇప్పుడు అది అంతా అబద్దం,కొలువుల కోసం కొట్లాడింది ఈ పిడికెడు ఉద్యోగాల కోసమేనా? ఉద్యమం సందర్బంగా జేఏసీ చెప్పిన 2.5లక్షల ఉద్యోగాలు, రెండేండ్ల కిందట బిశ్వాల్ కమిటీ తేల్చిన 2లక్షల ఉద్యోగాలు ఏమైపోయయో? పట్టుమని పాతిక సంవత్సరాలు నిండకముందే మేం కన్న కలలని కన్నీళ్లలో కలిపేస్తారా? కళ్ళ ముందు చూస్తుండగానే సొంత రాష్ట్రంలో ఒక తరం విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనమైపోయింది. ఇది ఏ విధంగా రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల త్యాగాల గౌరవాన్ని పెంచుతుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాత, పదే పదే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని, నిరుద్యోగుల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇగ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుల పండుగే అని అనుకున్నాం, కానీ మీకు కొలువులు ఇవ్వడం దండగే అనే రీతిలో కాంగ్రెస్ అడుగులు పడుతున్నాయ అనే అనుమానం వ్యక్తం అవుతున్నది.
ముఖ్యమంత్రి వాఖ్యలపై తీవ్ర నిరాశ, ఆగ్రహాంతో నిరుద్యోగులు?
యేండ్లకేండ్లు కుటుంబాలకి దూరంగా,అర్థ ఆకలితో,5 రూపాయల భోజనం చేస్తూ,అగ్గి పెట్టే అంత సైజు గదిలో ఉంటూ,పేదరికం కారణంగా తల్లిదండ్రులకి ఆర్ధిక భారం కాకూడదనే కారణంతో ట్యూషన్ చెప్పాడమో, అవమానకారంగా రోజంతా క్యాటరింగ్ వెళ్లడమో, కర పత్రాలు పంచడమో, రాపిడో, జొమాటో, స్విగ్గి వంటి పనులు చేస్తూ దయనీయ పరిస్థితిలో హీనంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారు. 30 యేండ్లు దాటినా పెండ్లి కాకుండా, ఉద్యోగం రాకుండా ఇంటికి వెళ్లలేక సొంత తల్లిదండ్రులకి ముఖం చూపించలేక ప్రైవేట్ జాబ్ కి వెళ్దాం అంటే స్కిల్స్ లేక నిరుద్యోగుల జీవితాలు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లలో ఆగిపోతున్నాయి. కొలువుల కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పై కోటి ఆశలు నిరుద్యోగులు పెట్టుకున్నారు. కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డీ గారు కనీస అవగాహన లేకుండా,భాధ్యతరహితంగా,చులకనగా, నిరుద్యోగుల జీవితాలని తీసిపడేసేలా మా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం అంటే నిరుద్యోగులు వద్దు అంటున్నారు అని అనడం నిజంగా సిగ్గుచేటు, ప్రభుత్వ పెద్దగా ఉండి నిరుద్యోగ ఉద్యోగ కలలని సమాధి చేస్తారా? ఏంతో భావోద్వేగానికి సంబంధించిన నిరుద్యోగ అంశంపై సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటంతో మళ్ళీ నిరుద్యోగులలో తీవ్ర నిరాశ నెలకొంది. గౌరవ సీఎం గారు అలా మాట్లాడాల్సింది కాదు! తండ్రి పాత్రలో ఉండే ప్రభుత్వమే తప్పుడు ప్రకటన చేయడంతో అస్సలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందో ఇవ్వదో అనే అయోమయంతో తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు నిరుద్యోగులు. అస్సలు కూలదనుకున్న గత ప్రభుత్వాన్ని కూల్చింది నిరుద్యోగులే అన్న సోయి ఎందుకో ఈ ప్రభుత్వానికి లేదు.
యేండ్ల కేండ్లు కుటుంబాలకి దూరంగా,అర్థ ఆకలితో,5 రూపాయల భోజనం చేస్తూ,అగ్గి పెట్టే అంత సైజు గదిలో ఉంటూ,పేదరికం కారణంగా తల్లిదండ్రులకి ఆర్ధిక భారం కాకూడదనే కారణంతో ట్యూషన్ చెప్పాడమో, అవమానకారంగా రోజంతా క్యాటరింగ్ వెళ్లడమో, కర పత్రాలు పంచడమో, రాపిడో, జొమాటో, స్విగ్గి వంటి పనులు చేస్తూ దయనీయ పరిస్థితిలో హీనంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారు. 30 యేండ్లు దాటినా పెండ్లి కాకుండా, ఉద్యోగం రాకుండా ఇంటికి వెళ్లలేక సొంత తల్లిదండ్రులకి ముఖం చూపించలేక ప్రైవేట్ జాబ్ కి వెళ్దాం అంటే స్కిల్స్ లేక నిరుద్యోగుల జీవితాలు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లలో ఆగిపోతున్నాయి. కొలువుల కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పై కోటి ఆశలు నిరుద్యోగులు పెట్టుకున్నారు.
ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చూపిస్తున్న సవితి తల్లి ప్రేమని నిషితంగా నిరుద్యోగులు గమనిస్తున్నారు,స్పష్టంగా నిరుద్యోగులకి ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయకపోతే ప్రభుత్వలని కూల్చడంలో, మార్చడంలో ఏమాత్రం వెనకాడబోరు నిరుద్యోగులు. ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో నిరుద్యోగులు తమ నిర్ణయం ఏంటో చెప్పేసారు,అయినా సీఎం స్థాయిలో ఉండి ఇంత పచ్చిగా అబద్దాలు చెప్తారా, అస్సలు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తాం అంటే వద్దంటారా? సదువుకున్నోల్లని కూడా మోసం చేస్తాం అంటే ఎలా? ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా అశోక్ నగర్ వచ్చారా, నిరుద్యోగులని కలసారా, ఏ ప్రభుత్వం ఉన్నా నిరుద్యోగులనీ మోసం చేస్తారనే సత్యాన్ని నిరుద్యోగులంతా తెలుసుకున్నారు. ఎందుకో నిరుద్యోగుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యాయి. నిరుద్యోగంపై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రకటనలని ప్రతిపక్షాలు తిప్పికొట్టడం లేదు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ప్రశ్నించే గొంతుకలన్ని నిరుద్యోగ అంశాన్ని బహిష్కరించాయా అనేలా కనీస స్పందన వారి నుండి లేదు. ఇంత కీలకమైన నిరుద్యోగ అంశాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టడంలేదు. మొత్తంగా నిరుద్యోగ అంశాన్ని గాలికి వొదిలేశారు అందరు? కనీస భాద్యత లేదు.తెలంగాణ ఏటు పోతుంది.
ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వంపై మహా ధర్నాకి సిద్ధమైన నిరుద్యోగులు!
సంవత్సరం తిరిగేలోగ 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి యేటా జాబ్ క్యాలెండరు ఇది నా గ్యారంటీ అని స్వయంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగుల కష్టాలని కళ్లారా చూసి చలించిపోయి స్పష్టంగా హామీ ఇచ్చారు. కానీ ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వచ్చి యాడదిన్నార అవుతుంది కేవలం 6 వేల ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ మేడిపండు కథలా మారింది. ఇచ్చింది కొంత అయినా చెప్పుకునేది కొండంత అని నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అగ్రహాంతో ఉన్నారు. ఉద్యోగాల కోసం చూసి చూసి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వంపై తాడో పేడో తెల్చుకోవాలని ఈ నెల 30 న ఓయూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నాకి నిరుద్యోగులు పిలుపు నివ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయింది.. ఉద్యోగాల భర్తీకి సంబందించి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.
అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడివేయకుండా తక్షణమే జూన్ 2న 2 లక్షల ఉద్యోగాలతో చట్టభద్ధమైన జాబ్ క్యాలెండరు ప్రకటించాలి. అలాగే నిరుద్యోగ భృతి 4000, జాబ్ క్యాలెండరు అమలుకు ముందే ప్రతి నియోజవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రళటించాలి. ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకి శిక్షణ ఇవ్వాలి. ప్రైవేటు ఉద్యోగాలలో 95శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి దక్కినప్పుడే అమరవీరులు కన్న కలలు సాకారం అవుతాయి. అవసరం అయితే ప్రభుత్వమే అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందివ్వాలి. నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉధారంగా రుణాలు ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులకి ఇచ్చిన హామీలన్నింటిని, నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం కృషి చేయాలనీ నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

8886806467





