నేను రాసేది కవిత్వం కాదు

నాకు చాలా దెబ్బలు తగిలాయి

నేను ఓడిపోలేదు

అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు

నా దారిని నేను వదిలిపెట్టలేదు

ఒంటరిగా వున్నప్పుడు

మనసు భరించలేని నొప్పివేస్తుంది

కన్నీళ్లు మాత్రం రాలడం లేదు

గుండె ఎండిపోయిందా

అన్నిటినీ తట్టుకొని గట్టిపడిందా

నాకు నీడగా, తోడుగా నడిచే బాధ,

నన్ను వొంటరి చేసి వెళ్లిపోయిందా

స్వప్నాలు ఏమైనాయో

సాగరాలు ఇంకిపోయాయో

తుఫాను వస్తుందా, సుడిగాలి లేస్తోందా

నేను పతంగ్ ను వదిలేయలేదు

గాలి జూలును విడిచి పెట్టలేదు

నేను రాసేది కవిత్వం కాదుకదా

అది ఓడిపోయిన వాళ్లు గెలిచే మంత్రం

అందుకే మీరు చదవలేరు

ప్రేమించడం సులభం కాదుకదా

అందుకే మీకు అర్థం కాదు

ఆశారాజు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *