ఇం‌కేమి చూడాలో..రామా!

రాత్రి అంత కలత చెందిన కళ్ళమీద
రెప్పల్నీ చిదిమికుంటు కారిన మద్యం
ఉదయం చుట్టు రక్త అవతరణ ఆలికిడియై
విచ్చుకుంది…, సూర్య బొమ్మతో…

తెల్ల గుర్రం నడుముకు నల్లవాగు
బెల్టులా చుటుకొని  పడగవిప్పి బుసలు కొట్టిన
ఒకానొక కాలంతో జతకట్టి, వర్తమాన కాలం
తనదైనా కొత్త బొమ్మ గీసుకుంది…

లోపల
గాయాల రక్తధారల్ని తూడిచెవాడు
ద్రోహిగా సంకేళ్ళతో నిలబడిండు…

తెల్లని ఆవు.. ఆవుపెడతో మొలకెత్తిన విత్తనం
ఎర్రటి రక్తజాడలతో మెల్లగా గుడిలోంచి…
బడిలోకి, కాళ్ళజెర్రితో పాకుతుంది…
పద్యం స్పష్టంత లేదేఏమో!
‘పాకింది’ సత్యవాక్యం పురుడు చెయాలి కవి…

మొన్న
సమూహల మధ్య బస్తీ, స్త్రీల నగ్నదేహాల
శిల వేసిన కాల కర్కష దృశ్యం
గుడ్లప్పగించి చూసినందుకు…ఏమో!

నిన్న
కాళ్ళకు కటుకున్న నల్లదారా
వంట మీద నల భక్తి వస్త్రం అయి
బడిలోకి పాకితుంది, కాదు స్పష్టంగానే పాకింది..

స్వరం మార్చుకున్న దేశభక్తి
గాలి మీద డేగ రెక్కలతో ముఖం పులుముకుంది..
ఇప్పుడు.. పంతులు కులంతో నేరస్తులు అవుతుండ్రు
రాజ్యం బెతాళుడిశవ చెట్టు కథలోకి
పిల్లలు నల్లోదయ చరిత అవుతుండ్రు..

రేపు….
మనిషి కాని మనిషలో
కాలం కాని కాలంలో..
ఇంకేమి చూడాలో…రామ!

– జనజ్వాల, 9949163770.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *