కలిసికట్టుగా ఆలోచించాలి

ఆధునిక కాలంలో యీ నాటి మహిళల ప్రశ్న యేమిటనేది సంధించాల్సినంత పదునుగా సంధించటం లేదు  సాహిత్యకారులు. యీ రోజు సమాజంలో స్ర్తీల జీవితాల్లో వస్తున్న వేగవంతమైన అనేక మార్పుల్ని, జీవన విధానాల్ని, విజయాల్ని, ఘర్షణల్ని, సంఘర్షణల్ని, పెరుగుతున్న హింసాధోరుణల్ని, మానసిక ఆరోగ్యాన్ని, సాహసాన్ని, పోరాట పటిమని, విజయాల్ని, అంతే వేగంగా రచయితలు తమ రచనల్లో అంతగా ప్రతిబింబించటం లేదనిపిస్తుంది. పబ్లిక్ ప్లేసస్ లో స్ర్తీల జీవితాల్లో జరుగుతోన్న దారుణమైన హింసాత్మక సంఘటనల వెనుక వున్నది.

పురుషాధిక్యత కంటే యెక్కువగా కనిపించే క్రూరత్వం యెందుకు యెక్కడ నుంచి వస్తుందో అంతా కలిసికట్టుగా ఆలోచించాల్సిన విషయమనిపిస్తుంది. స్ర్తీవాద సాహిత్యం ప్రారంభమైనప్పుడు యేయే అంశాలను రాసారో యిప్పుటికీ అవే విషయాలు స్ర్తీల జీవితాల్లో కొనసాగుతూ వుండటంతో ఆ అంశాల మీద సాహిత్యం యిప్పటికీ వస్తునే వుంది. ప్రపంచమంతా మాటాడుతున్న LGBTQ అంశాల మీద తెలుగులో విలువైన సాహిత్యం తెలుగులో వస్తోంది. యిప్పుడున్న  చట్టాలు, పధకాలు- సామాజికంగా, ఆర్థికంగా, మేధోపరమైన మార్పుకి యెంత వరకు వుపయోగపడుతున్నాయో, యింకేం కావాలోననే విస్తృతమైన చర్చ జరుపుతూ వాటిని సాహిత్యంలోకి తీసుకువచ్చే దిశగా ప్రయాణం చేయాల్సిన దశలో వుందనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *