అమ్మా….
ఆధునిక రాజ్యాలంటే ఏమిటీ?
నీకు తెలియకుండానే
నీ సత్తువనంతా పీల్చీ
నిన్ను నిర్జీవంగామార్చే
పెట్టుబడి జలగలను పెంచి పోషించేవి

ప్రజాస్వామ్యమంటే….?
వోటేసేంత వరకు మాత్రమే స్వేచ్ఛనిచ్చీ
ఎన్నికైనాక చట్టాలపేర నియంత్రించడం

యుద్ధ్దమంటే….?
పాలు కుడుస్తుండగానే….
స్తనాలను,శిశువుల పెదాలను
తెగనరకడం

మానవత్వమంటే…?
‘‘వీఆర్‌’’ ‌లో వీక్షిస్తూ
అనుభూతి చెందటం

మరీ
కవిత్వమంటే…?
మనిషింపోరాటం

-దిలీప్‌.‌వి
మానవ హక్కుల కార్యకర్త
మల్లంపల్లి,ములుగు
సెల్‌:8464030808

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *