‌జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన లగచర్ల బాధితులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ ‌నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. ఆదివారం దిల్లీకి చేరుకున్న బాధితులు  సోమవారం ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బాధితులు వివరించారు.

పార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, లగచర్ల బాధితులకు బీఆర్‌ఎస్‌ అం‌డగా నిలబడింది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసేందుకు లగచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ మాజీ చైర్మన్‌ ‌తుల ఉమ, ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ ‌తదితరులు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *