నీ మాటొకటి పడి మొలిచి

నా బ్రతుకులో పెద్ద

వృక్షమయ్యావు.

నీ తలపు వీచిప్పుడల్లా

ఊగే ప్రతి ఊహ

ఊడలు బారి

ఆ నీడలో నీవెక్కడున్నా

చల్లగా రోజూ

కాసేపు గడుపుతాను.

సేద తీరే ప్రతి సంగతిని

తృప్తిగా మనసారా

గుండెలో దాచుకుంటాను..

-శ్రీ సాహితి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *