మిశ్రమ స్పందన వచ్చింది

వేణు మరీదు

తెలుగు సాహిత్యంలో ఎల్జిబీటిక్యు కమ్యూనిటీకి సంబంధించి వచ్చిన వాటిలో నేను చదవగలిగింది బండి నారాయణస్వామి ‘అర్ధనారి’, ఎండ్లూరి మానస ‘మిళింద’, సొలోమోన్ విజయ్ కుమార్ రాసిన ‘మునికాంతపల్లి కథల్లో’ రెండుమూడు కథలు, ఆయనే రాసిన ‘సన్నాఫ్ జోజప్ప’ వంటివి. మర్యాదస్తుల ఎస్టాబ్లిష్డ్ ‘సంస్కృతీ విజిల్ బ్లోయర్స్’కు మరియు లైంగిక నీతులకు, కట్టుబాట్లకు, అన్నిరకాల మూఢ ‘టబూస్’కు ఎదురెళ్లి భిన్న మూర్తిమత్వాల్ని, ఉనికిని ధైర్యంగాచాటే పాత్రలు ఈ రచనల్లో కనిపిస్తాయి.

భిన్న అస్తిత్వవాదాలపై వస్తున్న విస్తృతమైన సాహిత్యంతో పోల్చుకుంటే ఎల్జీబీటీ కమ్యూనిటీపై అతితక్కువగా మాత్రమే సాహితీ సృజన జరుగుతుంది. నేను రాసిన ‘అతడి నుండి ఆమె దాకా’ కథ సంపూర్ణంగా ట్రాన్స్ యిష్యు మీదకాదు. ప్రకృతి సహజంగా కాకుండా స్వచ్ఛందంగా లింగమార్పిడి చేసుకున్న ఓ యువకుడి కథ ఇది.

గౌరీశంకర్ అనే పిల్లగాడు ‘గౌరీ’గా మారిన వైనం! ఇద్దరు ముగ్గురు స్త్రీలపట్ల మక్కువను పెంచుకొని చివరికి ఏ స్త్రీ ప్రేమ దక్కక భంగపడి “అసలేముందిరా ఈ ఆడతనంలో?” అనేప్రశ్న చిగురించి చివరికి అతడే స్త్రీత్వాన్ని పొంది దాన్ని అంతఃఅనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ కథ చదివిన పాఠకుల్లో మిశ్రమ స్పందన వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *