ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఇమిడికృతమైన సర్వధర్మ సమ భావనను భారత రాజ్యాంగ పీఠిక ద్వారా లౌకికవాద భావనను బహిర్గత పరిచారు. ఆ క్రమంలోనే రాజ్యాంగ హృదయం స్పందించింది. అది ఈ దేశానికి జీవనాడిగా ప్రకటించింది.
రాజకీయ నాగరిక పరిణామ దశలో రూపొందించబడిన భారత రాజ్యా ంగం గణతంత్ర భారతంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో దేశ వ్యాప్తంగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఒక వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగం నిర్థేశించిన మార్గంలో అద్భుతంగా నడుచుకుంటున్నామని ప్రగ ల్భాలు పలుకుతోంది. మరో వైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని పార్లమెంట్ వేదికగా బహిరంగంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నది. పౌర సమాజ సంస్థలు రాజ్యాంగ కీర్తిని ప్రశంసిస్తూనే ఇంకో కోణంలో పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేసే తీరులో సంపూర్ణంగా అడు గులు వేయలేదనే విమర్శను తీసు కొస్తున్నారు.
సవాళ్ల మధ్య రూపకల్పన
అనేక సవాళ్ల మధ్య జనవరి 26, 2025 నాటికి భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప ఆశించదగిన, అసాధా రణమైన విజయం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియా ఖండంలో కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాల్లో రాజ్యాంగం కేవలం మూడు దేశాల్లో మాత్రమే ఉనికిలో ఉంది. అందులో 1.భారతదేశం,2.తైవాన్ 3.దక్షిణ కొరియా. దక్షిణాసియాలో భారత రాజ్యాంగం మాత్రమే ఉనికిలో ఉంది. అయితే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో బహుళ రాజ్యాంగాలు రూపొందిం చబ డ్డాయి. మతపరమైన విభజనతో స్వాతం త్య్రం వొచ్చినప్పుడు రాజ్యాంగాన్ని రూపొ ందించే ముఖ్యమైన కసరత్తు అత్యంత క్లిష్టతరమైన సమయంలో చేపట్టారు. ఆ సమయంలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒక వైపు స్వాతంత్య్ర ప్రకటన, మరోవైపు అల్లర్లు, ఆకలి కేకలు భారతదేశాన్ని చుట్టు ముట్టాయి. ఐనప్పటికీ రాజ్యాంగ రూపకర్తలు వాటన్నింటిని అధిగ మించారు. నూతన రాజ్యాంగాన్ని రూపొం దించడానికి చారిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వ హించే సవాలును అధిగమించే స్థాయికి ఎదిగారు. నిజానికి ఇది చారిత్రక విజయం.
రాజ్యాంగ నిర్మాతల దూర దృష్టికి నిదర్శనం
భారత రాజ్యాంగం దాదాపు మూడు సంవత్స రాలలో రూపుదిద్దుకుంది. డిసెంబర్ 9, 1946 నుంచి మొదలై 26 నవంబర్, 1949న పూర్తయింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. ఇంగ్లాండ్‌లోని అత్యున్నత రాజ్యాంగ పండితులలో ఒకరైన సర్ ఐవర్ జెన్నింగ్స్ దీనిని ‘‘చాలా పొడవుగా, చాలా దృఢంగా వర్ణించడం ద్వారా అపహాస్యం చేసారు. ఇది నిజంగానే హేయమైన నేరారోపణ.! కానీ హాస్యాస్పద మేమిటంటే, అదే సమయంలో ఐవర్ జెన్నింగ్స్ స్వయంగా రూపొందించిన సిలోన్ (ఇప్పుడు శ్రీలంక) రాజ్యాంగం కేవలం 14 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. భారత రాజ్యాంగ సభ సమావేశాల ప్రార ంభం రోజున, తాత్కాలిక ఛైర్మన్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా, అమెరికన్ రాజ్యాంగ పండితుడు జోసెఫ్ స్టోరీ నుంచి స్పూర్తి వంతమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ యువత తమ పూర్వీకుల శ్రమ, బాధలు, రక్తం ద్వారా తెచ్చిన గొప్ప వారసత్వాన్ని (తమ రాజ్యాంగంలో) కలిగి ఉన్నారని ఎప్ప టికి మరచిపో నివ్వకండి విశ్వసనీయతతో సంరక్షించబడితే అది భవిష్యత్ తరాలకు వారి జీవితాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన ఆలోచనలు స్వేచ్ఛ, ఆస్తి, మతం, స్వాతంత్య్రం యొక్క శాంతియుత ఆనందాన్ని అందించగల సామర్థ్యం ఈ రాజ్యాంగానికి ఉంటుందని చెప్పారు.
వివిధ దేశాలలోని రాజ్యాంగ సంస్థల ప్రాము ఖ్యత గురించి తెలుసుకొని, ఒక రాజ్యాం గాన్ని బుట్టలా రాసుకోవడం సాధ్యం కాదని రాజ్యాంగ నిర్మాతలు తెలుసు కున్నారు. భారతదేశ పరిస్థితులకు అనుగు ణమైన దాదాపు 60 దేశాలకు పైగా రాజ్యాం గాల లోని అనేక విలువలను సేకరించి రాసు కున్నారు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఏర్పడ్డ మొదటి రిపబ్లిక్ వెంటనే కుప కూలిపో యింది. అనంతరం అరా చకాన్ని సృష్టిం చింది. చివరికి నెపోలియన్ ఎదుగుదలకు దారితీసింది. అలాంటి అనుభవాల దృష్ట్యా రాజ్యాంగ రూపకర్తలు, వారి మేధోమదనం ప్రకారం, సివిల్ సర్వీసెస్, హైకోర్టులు, విశ్వ విద్యాలయాలు, సైన్యం, ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతరులను చేర్చి ఈ సంస్థల పునాదిపైనే భారతదేశంలో ప్రజా స్వామ్యం రూపుదిద్దారు. రాజ్యాంగ వ్యాఖ్యానం పరిరక్షణ కోసం స్థాపించబడిన అత్యంత బలమైన సంస్థ సుప్రీంకోర్టు ఒక అత్యున్నత న్యాయస్థానంగా ఉన్నది. ఇది కార్యనిర్వాహక, శాసన శాఖలు ఏదైనా అధికార ఉల్లంఘనకు పాల్పడినా అటు వంటి శాసనాలు, నిర్ణయాలు చెల్లు బాటు కాదనే న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగించారు.
హక్కులనే బలమైన ఆయుధాలు
రాజ్యాంగ రూపకర్తలు మనస్సును కదిలించే భారతదేశ వైవిధ్యాలలో పాతుకుపోయిన నాగరికతా వారసత్వం గురించి స్పృహను కలిగి ఉన్నారు. భాష, మతపరమైన మైనా రిటీలకు ప్రత్యేక హక్కులను అందించడం, సమాన హక్కులకు హామీ ఇవ్వడం ద్వారా వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నారు. క్రమబద్ధమైన సామాజిక నిర్మాణాన్ని గుర్తిస్తూ, నిశ్చయాత్మక చర్య ద్వారా అణగారిన తరగతులకు సమాన హక్కులు కూడా రుపొందించబడ్డాయి. రాజ్యాంగాన్ని తయారు చేయడం ద్వారా భారతీయ మేధస్సుకు ఆధునికమైన నాగరిక విలు వలను జత చేసింది. సమానత్వ హక్కుకు హామీ ఇవ్వడం ద్వారా లింగం, కులం, మతం, నివాస ప్రాతిపదికన వివక్షతలను నిషేధించారు. తద్వారా రాజ్యాంగ నిర్మాతలు భారతదేశ భవిష్యత్ కు పునాదులు వేశారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వొచ్చిన వెంటనే, పౌరులు తమ హక్కుల రక్షణ కోసం ఆర్టికల్ 226 మరియు 32 ప్రకారం హైకోర్టులు, సుప్రీంకోర్టులో వరుసగా రిట్ పిటిషన్లు దాఖాలు చేశారు. వయోజన వోటు హక్కుతో పాటు ఈ హక్కుల పరి రక్షణ కోసం ప్రజాస్వామ్యం మార్గంలోకి రావడానికి, పటిష్టంగా మారడానికి వీలు కల్పించింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ పౌరుల హక్కులను అమలు చేసింది.తద్వారా పరిపాలనా వైపరీత్యాలు, శాసనపరమైన అతివ్యాప్తిని ప్రశ్నించడం ద్వారా ప్రజా స్వామ్య జవాబుదారీతనాన్ని నిర్ధా రిస్తుంది. నాటి నుంచి నేటి వరకు భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలకు హక్కుల రూపంలో బలమైన ఆయుధాలను అందించింది.
సవరణ ఏదైనా ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాలి
ఈ ఏడున్నర దశాబ్దాల కాలక్రమంలో రాజ్యాంగం భిన్న కులాలను, విభిన్న మతాలు, కులాలు, అనేక సంస్కృతులను, సంప్రదాయాలను గౌరవిస్తూ భారత పౌరులు సమోన్నతంగా అభివృద్ధి చెందడానికి కావా ల్సిన అవకాశాలను అందించింది. ప్రజల ఆకాంక్షల వెలుగులో రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాలను నొక్కి చెప్పింది. అంతిమంగా ఈ దేశంలోని ప్రభుత్వాల విధి విధానాలు రూపొం దించడానికి సర్వో న్నతమైన రాజ్యాంగమే ప్రాతిపదిక కావాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రస్తావించారు. పాలకులు, పాలితులు వ్యవస్థలు, సంస్థలు రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలనేది దీని సారాంశం. ఈ కాలక్రమంలో 75 ఏండ్ల కాలంలో భారతీయ సమాజం అనేక సవాళ్లను విసిరింది. రాజ్యాంగం అనేక ఒడిదు డుకులను ఎదుర్కొంది. వాటిని ఛేదించుకునే క్రమంలో రాజ్యాంగం 106 సార్లు సవరణలకు గురైనది. ఈ సవరణలు మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకే జరుగు తాయి. కాని ఈ సందర్భంలో రాజ్యాంగం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయమనే ఆదర్శాల సముహమని గుర్తెరగాల్సిన బాధ్యత ఉన్నది. ఏ సవరణ జరిగినా వ్యక్తుల స్వేచ్ఛ హక్కులను బలోపేతం చేసేలా ఉండాలి కానీ హరించే విధంగా ఉండకూడదు అనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. ప్రజాస్వామ్య శక్తి బలపడి నప్పుడే రాజ్యాంగ సవరణల పట్ల ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం లేక పోలేదు.
ఆధిపత్య శక్తులను నిలువరించింది
ఆరున్నర దశాబ్దాల కాలంలో రాజ్యాంగం అనేక ఒడిదొడుకులను, నియంతృత్వాలను ఎదుర్కొని నిలబడగలిగింది. గత దశాబ్ద కాలంగా భారత రాజ్యాంగంలో నుంచి మానవీయ చారిత్రక సామాజిక విలువలను తొలగిస్తూ రాజ్యాంగాన్ని ఒక డొల్లగా మార్చే యత్నం యుద్దప్రాతిపదికన మార్చేందుకు ప్రతిఘాతక శక్తులు కృషి చేస్తున్నాయి. ఈ రాజ్యాంగం ప్రగతి నిరోధక శక్తులను అడ్డుకొని ప్రజల పక్షాన నిలబడ్డది. గత అరువై ఏండ్లుగా ఆధిపత్య వర్గాలకు తమ ఆధిపత్య స్వభావాన్ని నిలబెట్టలేకపోవడంలో అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని శత్రువు గా ప్రకటించదలుచుకుంది. రాజ్యాంగ స్థానంలో తమ ప్రయోజనాలే ధ్యేయంగా, బానిసత్వానికి ఇరుసుగా ఉన్న మనుస్మృతిని తీసుకురావడం ద్వారా భారతదేశ చరిత్ర పాదాలను వెనక్కి విరసాలునుకుంటుంది. ఈ క్రమంలోనే శాసన, కార్య, న్యాయ వ్యవస్థలన్నింటిలోను తమ పరివార మూ కలతో నింపివేసుకుంది. ఆ క్రమంలో వొచ్చినవే లేబర్ కోడ్ బిల్లులు, వ్యవసాయ చట్టాలు, ఈ మధ్య కాలంలో వొస్తున్న న్యాయస్థానాల తీర్పులు, పదవి విరమణ పొంది రాజ్యసభకు నామినేట్ అవుతున్న న్యాయమూర్తులను ఆ కోవలో చూడా ల్సిందే.. ఇందుకు పూనాదిగా ప్రజా స్వామ్యం, సమానత్వం,రాజ్యాంగం ఈ మూడిరటిని శత్రువులుగా గోవాలో సంఫ్‌ు ప్రకటించిన విషయాన్ని మనం మరు వరాదు.
అసమ్మతిని తట్టుకోలేక భావప్రకటన పై దాడి
పాలకులు రాజ్యాంగాన్ని నిర్యీర్యం చేయాలని చూస్తున్నారు. స్వతంత్ర ఉద్యమం చిన్న చూపు చూడబడుతుంది. గత పదేళ్లుగా రాజ్యాంగ కేంద్రంగా కాకుండా రాజ్యాం గేతర ఫరివార్ కేంద్రంగా నియంతృత్వ నిర్ణయాలు జరుగుతూ వస్తున్నాయి.అందులో భాగంగా 19వ ఆర్టికల్ కింద రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ పై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నించిన కల్బుర్గి, గౌరీ లంకేష్, స్వామి అగ్నివేశ్, ఫన్సారే, ఫాదర్ స్టాన్ స్వామి, ప్రొ:సాయిబాబా వంటి రచయితలను, కళాలను, గళాలను చంపేశారు. ఏడుపదుల వయసులో ఉన్న వరవరరావు లాంటి ప్రజా కవులపై ఆకారణంగా ఉపా లాంటి నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి విచారణ ఖైదీలుగానే నిర్బంధించబడుతున్నారు. స్వతంత్ర ప్రజామీడియా సంస్థలను వేధిం పులకు గురి చేస్తున్నారు. సంఫ్‌ు పరివార్ శక్తులపై వార్తలు రాసిన జర్నలిస్టులను హత్యలు చేస్తున్నారు. పుస్తక విక్రయ కేంద్రాలపై, పుస్తకాలు రాస్తున్న రచ యితలపై బహిరంగంగానే దాడులకు పాల్ప డుతున్నారు. పత్రికలకు వ్యాసాలు రాస్తున్న రైటర్స్‌పై అడ్డు అదుపులేని అన్ పార్లమెంటరీ పదజాలాన్ని ఉపయోగిస్తూ చిత్ర హింసలకు గురిచేస్తున్నారు.అసమ్మతిని, విమర్శ ప్రాణ ప్రదమైన సమాజంలో వాటిని అణిచి వేసేందుకు కనీస అవగాహన లేకుండా సామాజిక మాధ్యమాలలో విశృంకలమైన అసభ్య పదజాలంతో పెట్రేగిపోతున్నారు.
అభివృద్ధి పేరుతో మానవ హననం
తమ స్వయం ప్రతిపత్తి కోసం చేసిన అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా భారత రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక రక్షణలను కల్పించింది. కానీ నేడు ఆదివాసులను సమూలంగా తొలగించేందుకు ఖనిజ సంపదను, అడవులను తమ సొంత కార్పొ రేట్ వ్యవస్థ అధిపతులైన అదానీ అంబా నీలకు తాకట్టు పెట్టేందుకు మోదీ ప్రభుత్వం రక్త పిపాసి ఇజ్రాయిల్ సాంకేతిక సహ కారంతో లక్షలాది సాయుధ దళాలను ఉపయోగించి దండకారణ్యంలో జీవించే హక్కును నిరాటంకంగా హత్య చేస్తోంది. ఆదివాసీ గిరిజనుల హక్కులను కాలరాస్తూ అదాని ఆస్తులను లక్షల కోట్లకు పెంచు తున్నారు. మోదీ, అమిత్ షాలు నడి బజా రులో ప్రజాస్వామ్యం ప్రాణం తీస్తున్నారు. మానవ హననానికి అదుపు లేకుండా పోయింది. మణిపూర్ రాష్ట్రంలో రెండు గిరిజన జాతుల మధ్య వైరుధ్యాన్ని సృష్టించి రాజకీయ స్వార్థం కోసం ఆశాంతి అలజడలకు తెరలేపింది. అభివృద్ధి పేరుతో విధ్వసాన్ని సృష్టిస్తున్నారు.
లౌకిక స్పూర్తికి ప్రమాదం
ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఇమిడి కృతమైన సర్వధర్మ సమ భావనను భారత రాజ్యాంగ పీఠిక ద్వారా లౌకికవాద భావనను బహిర్గత పరిచారు. ఆ క్రమంలోనే రాజ్యాంగ హృదయం స్పందించింది. అది ఈ దేశానికి జీవనాడిగా ప్రకటించింది. కానీ రానురాను మతతత్వ భావజాలం ముదు రుతూ వొస్తుంది. మైనారిటీల హక్కులను హరించి వేస్తున్నారు. మనుషుల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధిస్తున్నారు. కళలు, సాహిత్యం, చలనచిత్రాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యక్తీకరణలు, ప్రాతినిధ్యాలు మొదలైన వాటిని వారు ఆమోదించడం లేదు.లౌకిక స్పూర్తి ని తూలనాడుతూ వైదిక మతంలోకి మారడానికి మైనారిటీ వర్గాలను బలవంతం చేస్తున్నారు. మత మార్పిడిలతో దాడులు చేస్తు న్నారు.పండుగలు,వేడుకలు, వాలె ంటైన్స్ డే వంటి సందర్భాల్లో బలవంతపు హింసను ప్రయోగిస్తున్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం మనిషికి ప్రాధాన్యమిస్తే, బిజెపి పాలకులు హృదయం లేని మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మత స్వేచ్ఛను నిరోధించడం లాంటి చర్యలు తిరోగమనం వైపు నెట్టివేస్తున్నాయి.
సమాఖ్య స్పూర్తికి విఘాతం
భారతీయ భౌగోళిక వైవిధ్యమే ఇరుసుగా జాతి రూపకల్పన కోసం భారత రాజ్యాంగం సహకారాత్మక ధోరణితో కూడిన రాజకీయ, పాలనా వ్యవస్థల కోసం ఫెడరిలిజాన్ని రూపొందించింది. రాజ్యాంగం రాష్ట్రాలకు ప్రసాదించిన అధికారాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఉదాహరణ 371, జి.ఎస్.టి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అభా సుపాలు చేస్తూ జమిలీ ఎన్నికలను తీసుకొచ్చే యత్నం చేస్తున్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా కేంద్రం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కాలం చెల్లిన సామాజిక వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవస్థకు అప్పగించడానికి ప్రభు త్వం వ్యవసాయ రంగం నుంచి వైదొలిగే కుట్రలో భాగంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది.దేశవ్యాప్తంగా రైతులు చేసిన తీవ్రమైన ప్రతిఘటనతో వెనక్కి తగ్గినట్లే తగ్గి మరో సారి తెరపైకి తీసుకొస్తోంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణాచ గోదావరి నది జలాల సహ ఇతర రాష్ట్రాల నది జలాల పంపకాల విషయంలో కేంద్రం తల దూరుస్తూ వివాదాలను సృష్టిస్తూ, నదులను నదీవ్యవస్థ లను కబ్జా చేస్తున్నది. బిజెపియేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థ కేంద్రం కనుసైగల్లో అధిక జోక్యం చేసుకుంటుంది. ఇదే క్రమంలో సిబిఐ, ఈడి లాంటి దాడులను ప్రోత్సహిస్తూ వొస్తుంది. మొత్తంగా భాజపా రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బస్తోంది.
రోజురోజుకు రాజ్యాంగ విలువలను దిగజా రుస్తున్నారు. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంబేడ్కర్ గురించి, రాజ్యాంగం గురించి ప్రస్తావించిన క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అంబేడ్కర్ పట్ల స్పందించిన తీరును బట్టి భారత రాజ్యా ంగం, దాని విలువల అమలు తీరు ఏవి ధంగా ఉందో తేటతెల్లమైంది. ఈ దేశానికి సర్వోన్నత శాసన వ్యవస్థ పార్లమెంటే.. కాదనలేం. కానీ అన్ని వ్యవస్థలకు అత్యు న్నతమైన ప్రామాణికమైన వ్యవస్థ రాజ్యా ంగమే. రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలు ప్రజల జీవన విధానంలో ప్రతిబింబించేలా ఉండాలి. ఇది కొలమానంగా తీసుకోకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నిరర్థకమే.
ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి
అనేక త్యాగాలు, రక్తం, కన్నీళ్ల ఫలితంగా రాజ్యాంగం రూపొందించబడిరది. కానీ ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే నిర్వీర్యం చేసే కుట్రలకు పూనుకున్నారు. ఈ క్రమంలో 1949 నవంబర్ 25 అర్ధ్రత్రి రాజ్యాంగ ఆమోదం సందర్భంగా అంబేడ్కర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాం.’’ రాజ్యాంగం ఎంత మంచిదైనా కొన్ని సందర్భాలలో చెడుగా మారడం ఖాయం ఎందుకంటే పనిచేయడానికి పిలిచిన వారు చెడ్డవారైతే ఎంతమంచి రాజ్యాంగమైనా చెడ్డగా మారిపోతుంది. ఒకవేళ రాజ్యాంగం ఎంత చెడ్డదైనా పనిచేయడానికి పిలిచిన వారు మంచిగా మారితే అది మంచిగా మారుతుంది ఈ వ్యాఖ్యలను అనుసరించి చైతన్యవంతమైన ప్రజలు తయారు చేసుకోవడం ద్వారా, ఇప్పుడున్న పాలకులను గతం కంటే తీవ్రంగా ఎదుర్కోవడం ద్వారా భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలమనే విశ్వాసాన్ని ప్రజలలో కల్పించాలి.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192





