“ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిన తర్వాత సాదాబైనామాలపై ఎలాంటి క్లీయర్ గైడ్ లైన్స్‌తో కూడిన జీఓ విడుదల చేయలేదు. అన్లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను గ్రామ పంచాయితీ నోటీస్ బోర్డ్‌లో పెట్టి గ్రామాస్తుల నుంచి సాదాబైనామా దరఖాస్తుదారులకు నోటీసులిచ్చి డాక్యుమెంట్స్ తీసుకోవాలని ఎమ్మార్వోలకు, జీపీవోలతో సాదాబైనామా రిజిస్ట్రేషన్లు మమా అనిపించే ప్రయత్నం చేస్తుంది. సాదాబైనామా విషయంలో ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడమే కాకుండా మౌలిక ఆదేశాలతో గ్రామాల్లో ప్రక్రియను మొదులు పెట్డడంతో సాదాబైనామాలో భూములు కొన్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు..అటు రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు అపసోపాలుపడుతున్నారు.”
తెలంగాణలో రైతులు పాలిటి ప్రభుత్వాలు యముడి లా తయారయ్యారు. రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటూనే రైతులను రోడ్డుపై నిలబెట్టుతున్నాయి. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలను ఎదుక్కొంటూనే మరోవైపు రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పంట వేసే దగ్గర నుంచి, విత్తనాలు, ఎరువులు పురుగుల మందుల కోసం రైతు నిత్యం యుద్దం చేయాల్సి వస్తుంది. పండిన పంటను మార్కెట్‌లో అమ్ముకోవడం అంటే రైతుకు కత్తిమీద సామే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన రైతుల బతుకుల్లో వెలుగులు లేవు. భూమి పరిమితమైన వనరు కావడంతో అది అనేక సమస్యలకు మూల కేంద్రం అవుతుంది.ఆ సమస్యలను పరిష్కరించే మార్గాలను అన్వేషించకుండా ప్రభుత్వాలు వాటిని మరింత జఠిలం చేస్తున్నారు తప్ప ముగింపు దొరకడం లేదు. శాస్త్ర సాంకేతిక పెరిగే కొద్దీ భూ సమస్యలు మరింత పెరుగుతున్నాయి , ఎక్కడో ఒక దగ్గర ఎండ్ కార్డ్ పడటం లేదు.
తెలంగాణ ఏర్పాటు నాటికి .రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులు తమ భూములను అధికారికంగా పట్టాలు చేసుకోలేదు.. చేసుకునే చైతన్యం లేకపోడంతో భూముల అమ్మకాలు కొనుగోలుపై ప్రజలు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. తెల్ల కాగితాలపై మార్పిడి జరిగిపోంది. .సాధారణంగా తెల్ల పేపర్లపై కోనుగోలు చేయడం..కష్టాలు వచ్చినప్పుడు అదే తెల్లకాగితంపై మరోకరి అమ్మడం కామన్‌గా జరిగింది..ఉద్యమం సమయంలో భూ సమస్యలు, సాదాబైనామా పై చర్చకు వచ్చింది. భూములు పట్టాలు చేయించుకోవాలన్న ఆలోచనే నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ ప్రాంత రైతులకు రాలేదు. అప్పుడున్న కరువు కాటకాల వల్ల భూమికి అసలు విలువే ఉండేదే కాదు. అసలు రెవెన్యూ చట్టాలపై అవగాహన 99 శాతం మంది తెలంగాణ రైతులకు లేదంటే అతిశయోక్తి కాదు. భూమి శిస్తుల కట్టడం తెలుసుగానీ పట్టాలు చేయించుకోవాలన్నది తెలియదు. తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్యవ్యవస్థ ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో భూ సమస్యలపై చర్చ జరిగిన సందర్భాల్లో భూస్వాములు ఇతరుల నుంచి భూమి కోనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులకు తమ భూములపై హక్కులు కల్పించాలి తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాదాబైనామా అనే స్కీమ్ తీసుకువచ్చింది.
సాదాబైనామా అంటే రైతులు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పద్దతిలో కాకుండా తెల్ల కాగితాలపై భూముల అమ్మకాలు కొనుగోలు చేయడం. సాదాబైనామా అనేది తెల్ల కాగితాలపై రైతులు చేసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాలు.అధికారిక రిజిస్ట్రేషన్ లేని పరస్పర అగ్రీమెంట్లు..అయితే తెలంగాణ వచ్చాకా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సాగుతాగు ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇచ్చింది..దీంతో భూము రేట్లు పెరుగుతాయని, చాలా మంది రైతులు తమ భూములు కాగితాల మీదనే రాసుకున్నారు..కానీ పట్టాలు చేసుకులేదని ఉద్యమం సమయంలో వచ్చిన చర్చతో సాదాబైనామా భూములను మోక్షం కల్పించి, రైతుకు భూ హక్కులు కల్పించి, ఐదేకరాల లోపు భూములను క్రమబద్దీకరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాదాబైనామా స్కీమ్ ప్రకటించింది.
ధరిణి స్కీమ్ ప్రారంభించిన సందర్భంగా సాదాబైనామాలు పరిష్కరిస్తామని ప్రకటించింది..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014 ముందునాటికి సాదాబైనామా కింద వ్యవసాయ భూములు కొనుగోలు చేసి సాగు చేస్తున్నట్లైతే వాటికి రెగ్యూలరైజేషన్ చేసేందుకు సర్కార్ స్కీమ్ తీసుకువచ్చింది. 2017లో ప్రభుత్వం సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించింది..మొదటి దశలో స్కీమ్ సక్సెస్‌గా అమలు చేసిన ప్రభుత్వం, అప్పుడు సాదాబైనామా అప్లై చేసుకోలేని వారికి 2020 నవంబర్‌లో రెండోసారి అవకాశం ఇచ్చింది..కోర్టు కేసుల వల్ల రెండో దశ సాదాబైనామా అప్లిక్లేషన్స్ రెగ్యూలరైజేషన్ 2025 సెప్టెంబర్ రెండోవారం వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిన తర్వాత సాదాబైనామాలపై ఎలాంటి క్లీయర్ గైడ్ లైన్స్‌తో కూడిన జీఓ విడుదల చేయలేదు. అన్లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను గ్రామ పంచాయితీ నోటీస్ బోర్డ్‌లో పెట్టి గ్రామాస్తుల నుంచి సాదాబైనామా దరఖాస్తుదారులకు నోటీసులిచ్చి డాక్యుమెంట్స్ తీసుకోవాలని ఎమ్మార్వోలకు, జీపీవోలతో సాదాబైనామా రిజిస్ట్రేషన్లు మమా అనిపించే ప్రయత్నం చేస్తుంది. సాదాబైనామా విషయంలో ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడమే కాకుండా మౌలిక ఆదేశాలతో గ్రామాల్లో ప్రక్రియను మొదులు పెట్డడంతో సాదాబైనామాలో భూములు కొన్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు..అటు రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు అపసోపాలుపడుతున్నారు.
సాదాబైనామా అంటే తెల్ల కాగితాలపై భూములకు ప్రభుత్వం విచారణ చేసి పట్టాలు ఇవ్వాలి..కానీ ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న తీరుతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. అసలు సాదాబైనామా కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో అధికారులకే క్లారిటీ లేదు. ఆర్డీవో నుంచి ఎమ్మార్వో జీపీవోలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. విభిన్న నిబంధనలతో రైతులను ఆయోమయానికి గురి చేస్తున్నారు. అంతేకాదు ఒక్కఒక్క మండంలో ఒక్కొక్క నిబంధనలు అధికారులు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన గైడ్‌లైన్స్ జీఓ విడుదల కాకపోడంతో తమకు ఏం చేయాలో, సాదాబైనామాలపై ఏలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదని అధికారులు తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.
ఉదాహణకు నేను ప్రత్యేక్షంగా చూసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి..జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ అనే గ్రామంలో సాదాబైనామా చేసుకోవాలని గ్రామ పంచాయితీకి వచ్చిన రైతుకు అక్కడ ఆశ్చర్యే పోయే విషయాలు అధికారులు చెప్పారు. ఆ రైతుకు మోకా మీద భూమి ఉంది.40 ఏళ్లులుగా భూమి సాగు చేసుకుంటున్నాడు. సాదాబైనామాలో అప్లై చేసుకున్నారు.లిస్ట్‌లో పేరు కూడా వచ్చింది. ఇప్పుడు అధికారులను అడిగితే అప్పుడు అమ్మిన వారిని తీసుకు రావాలని,వారిపై పట్టా ఉంటేనే మీకు అవుతుందని అధికారులు చెప్పారు. ఇప్పుడు ఆ రైతు అమ్మిన వాళ్లను ఎక్కడ వెతికి తీసుకువస్తాడు..?.ఎప్పుడు గ్రామం విడిచివెళ్లిన వారిని ఎలా ఆ రైతు తీసుకురాగలడు.?.వచ్చిన ఎనకట ఎంతో కొంత గంపగుత్తగా ఇచ్చి కొనుగోలు చేసిన రైతు ఇప్పుడు భూముల రేట్లు పెరడంతో వారి వారసులు సంతకాలు పెడుతారా..?. ఇవన్నీ రైతులకు వద్దనే కదా సాదాబైనామాలో భూములు కొన్న వారికి పట్టాలు చేయాలని స్కీమ్ తీసుకువచ్చింది.
అంతేకాదు ఆ రైతుకు అధికారులు చెప్పి మాట వింటే ఆశ్చర్యమే కాదు..ఆందోళనల కూడా అనిపిస్తుంది. సాదాబైనామాలో అప్లై చేసుకున్న రైతుకు పట్ట కావాలంటే ఫస్ట్ అమ్మిన వ్యక్తిపై పట్టా కావాలట..ఇప్పుడు ఆ రైతు తాను పట్టా చేసుకోవాలని సాదాబైనామాలో అప్లై చేసుకుంటే.ఇప్పుడు అమ్మిన వ్యక్తికి పట్టా కావాలి కొర్రీలు పెట్టడం ఏంటి..? ఇప్పుడు ఆ రైతు పట్టకావాలంటే అమ్మిన వ్యక్తిక పట్టా ఎప్పుడు కావాలి.ఆయన మళ్లీ కొన్న రైతుకు ఎప్పుడు సంతకం చేయాలి..అసలు సాదాబైనామా లో కొన్ని తరాలు పట్టాలు లేకుండానే భూ బదాలయింపు ఒప్పందాలు చేసుకున్నారు..ఇప్పుడు వారందరీ ఎప్పుడు పట్టా కావాలి.వారిని ఇప్పుడు ఈ రైతుకు ఎప్పుడు పట్టాకావాలి..వారందరీకి పట్ట ఖర్చులు ఎవరూ పెట్టుకోవాలి..?.ఇది అస్సలు అయ్యే పనేనా..?.కేవలం రైతులను ఇబ్బందులు పెట్టే పని కకాపోతే మారేంటి..?.
అంతేకాదు, సాదాబైనామా అమలు విషయంలో ఒకటే ప్రభుత్వం రకరకాల నిబంధనలన్నట్లు ఉంది..ఒక మండలంలో అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తులు వచ్చిన రాకున్న సాదాబైనామాలో అప్లై చేసుకున్న రైతు వస్తు అతని నుంచి దరఖాస్తులు తీసుకుంటే పక్కనే ఉన్న మరో మండంలో అమ్మిన, కొన్న వ్యక్తులు వస్తేనే..అందులోనూ అమ్మిన వ్యక్తిపై అంతకు ముందు పట్టా ఉంటేనే రైతులను నోటీస్‌లపై అభిప్రాయం కోరుతు డాక్యూమెంట్లు తీసుకుంటున్నారు..లేకపోత రైతు నుంచి కనీసం పేపర్లు కూడా అధికారులు తీసుకోవడం లేదు. .ప్రభుత్వం, రెవెన్యూశాఖ వెంటే సాదాబైనామాలపై స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి. సాదాబైనామా అంటేనే అవన్నీ అవసరం లేదు. రైతులను ఇబ్బందులు పెట్టుండా ప్రభుత్వమే అమ్మకం దారులకు అవసరం అయితే నోటీసులు ఇవ్వాలి.
అమ్మిన వ్యక్తి ఏదైన అభ్యంతరాలు చెపితే రైతుకు నష్టం లేకుండా ఫీల్డ్ సర్వే చేసి, చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలు తీసుకుని వాస్తవం తెలుసుకుని గ్రామ సభలో కొన్నవారికి న్యాయం చేయాలి..ముందు అమ్మిన వ్యక్తిపై పట్ట ఉండాలన్న నిబంధనలు ఎత్తివేయాలి. ప్రభుత్వానికి అదే అవసరం అయితే సర్కారే ప్రీగా అమ్మిన వ్యక్తికి పట్టా చేసి వెంటనే సాదాబైనామాలో కొన్న వారికి పట్టా చేయాలి.ప్రభుత్వం భూములను రిసర్వే చేయాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు ప్రతి సర్వే నెంబర్‌కు జీయో ట్యాగ్ చేయాలి.
సర్కార్ అనాలోచిన నిర్ణయం, క్లీయర్ గైడ్ లైన్స్ ఇవ్వకుండానే గ్రామాల్లో రైతులు, అధికారుల మధ్య ప్రభుత్వం చిచ్చుపెట్టింది. అంతేకాదు, గత కొన్నేళ్లుగా గ్రామాల్లో భూ తగదాలు తగ్గాయి..గత ప్రభుత్వం చేసిన సాదాబైనామా తర్వాత ధరణి పోర్టల్, ఇప్పుడు భూ భారతి వచ్చాక డైరెక్ట్ భూముల కోనుగోలు ఎమ్మార్వో సమాక్షంలోనే జరుగుతున్నాయి.ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో గ్రామాలు మళ్లీ భూ తగదాలతో తెల్లార్లుతున్నారు.దశాబ్దాల క్రితం అమ్ముకున్న వాళ్ళు కొన్నవారిపై తిరగబడుతున్నారు.
అన్నదమ్ముల మధ్య వివాదాలు, పాలోళ్లపంచాయితీలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. అందుకు ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. అంతేకాదు ఇలాంటి తలతోక లేని ప్రభుత్వం నిర్ణయాల వల్ల మళ్లీ గ్రామాల్లో అవినీతి పెరిగే ప్రమాదం ఉంది..వీఆర్‌వోలను మార్చి జీపీలను పెట్టినా..ఇలాంటి కొత్త నిబంధనలతో అవినీతికి అస్కారం ఉంటుంది.తక్షణమే ప్రభుత్వం స్పందించి సాదాబైనామాలో అప్లై చేసుకున్న భూములు సర్వే చేయాలి.అమ్మిన వ్యక్తితో సంబంధంలో ఈ పథకం కింద, గతంలో దరఖాస్తు చేసుకున్నరైతులకు పట్టాలు ఇవ్వాలి.
-తోటకూర రమేష్





