“తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం ఒక్కటే కాదు, సంస్కృతి ఆధిపత్య వ్యతిరేక పోరాటం కూడా..తెలంగాణలో ట్యాంక్ బండ్ సహా తెలంగాణ వ్యాప్తంగా సీమాంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారి ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దారు..ఈ విగ్రహాధిపత్య సంస్కృతికి వ్యతిరేకత కూడా ఉద్యమంలో కీలక భాగస్వామ్యమైంది. సీమాంధ్రుల విగ్రహాలు తొలగించి తెలంగాణ కవులు ,కళాకారులు, ఉద్యమకారులు, ముఖ్యమైన రాజకీయ నాయకులు విగ్రహాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కీలకమైంది. ఈ డిమాండ్ లోంచి పుట్టిందే ట్యాంక్ బండ్ పై సీమాంధ్రుల విగ్రహాల ధ్వంసం.”
రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 16 ఏళ్లు అవుతున్నా తెలంగాణపై ఇంకా సమైక్యవాదుల పెత్తనం కొనసాగుతూనే ఉంది . తెలంగాణ అస్థిత్వాన్ని సీమాంధ్ర సంస్కృతాధిపత్యం దెబ్బకొట్టుతూనే ఉంది ఆత్మగౌరవాన్ని కించపర్చుతూనే ఉన్నారు. ఏ ఆధిపత్యం, సంస్కృతికి, భాషా, యాస, విగ్రహా రాజకీయాధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేసి, విద్యార్థి, యువత ప్రాణ త్యాగాలతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తెలంగాణలో మళ్లీ సమైక్యవాదుల ఆధిపత్యం మొదలుపెట్టింది..తెలంగాణ అస్థిత్వంపై దాడి చేస్తున్నారు..ఆత్మగౌవరాన్ని దెబ్బ తీస్తున్నారు..హైదరాబాద్ పై ఆధిపత్యం కోల్పోకుండా ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందు కుట్రలు చేశారు..కేంద్రంలో ఉన్న పలుకుబడితో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్రలు చేశారు. తెలంగాణ ప్రజలు నిత్యం అప్రమత్రతో ఉంటూ సమైఖ్య పాలకులు చేస్తున్న కుట్రలపై జాగరూకులై ఉండటంతో ఆ కుట్రలన్నీ భగ్నం అయ్యాయి.
గత రెండేళ్లుగా తెలంగాణపై సమైక్యవాదులు పంజా విసురుతున్నారు..తమ ఆధిపత్యాన్ని తెలంగాణ పై ప్రదర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కంటే సీమాంధ్ర వ్యాపారులు ఎజెంట్గా ఉంటడంతో వారి ఆధిపత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆస్థిత్వం, ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మ లేకపోవడంతో మొదటి నుంచి తెలంగాణకు విరుద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణకు నష్టం జరిగేలా, ఏపీకి లాభం జరిగేలా పాలన చేస్తున్నారు.
తెలంగాణ వచ్చి 16 ఏళ్లైతున్న ఇంకా సెక్రటేరియట్ ల్లో తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర ఉద్యోగుల ఆధిపత్యం, వేధింపులు కొనసాగుతున్నాయని మన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, నిరసనలు కూడా తెలుపుతున్నారంటే తెలంగాణలో ఉన్నది టీకాంగ్రెస్ ప్రభుత్వమా..? లేక టీడీపీ కాంగ్రెస్సా..?.తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆధిపత్యం ఉందంటేనే తెలంగాణ ఉద్యోగాలను ఏ విధంగా రేవంత్ రెడ్డి సీమాంధ్ర ఉద్యోగులతో నింపేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టి, ప్రజల ఆదాయం రాష్ట్ర పలుకుబడి పెంచిన వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖలో సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర ఆధికారులను కీలక స్థానంలో నియమించారు..చంద్రబాబు రిఫరెన్స్నో ఇంకేవరి ఆదేశాలతోనో ఆ అధికారులను తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చలాయించేలా అపాయింట్ చేస్తున్నారు..తెలంగాణలో అంతకంటే గొప్ప అధికారులున్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రెండేళ్లుగా తెలంగాణ పై సమైక్యవాదులు అవాకు చవాకులు పేలుతూనే ఉన్నారు..తెలంగాణ ప్రజలను కించర్చుతూ ఆస్థిత్వం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తునే ఉన్నారు..కానీ ఏనాడు రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ గానీ తెలంగాణకు మద్దతుగా మాట్లాడలేదు..సమైక్యవాదుల చిల్లర కామెంట్స్ ను ఖండించిన పాపాన పోలేదు..వెరిసి వారికే కాంగ్రెస్ వత్తాసు పలుకుతుంది.
ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆ సీమాంధ్ర ఆనవాళ్లు పోతాయనుకుంటే రెండేళ్లుగా మళ్లీ పెరుగుతున్నాయి తప్ప తెలంగాణ నుంచి వెళ్లడం లేదు..సమైక్యవాద భావజాలపు ఆనవాళ్లను కాలగర్భంలో కలపాల్సిన పాలకులు వాటిని ఎంకరేజ్ చేయడమే కాదు, ఆ భావజాలాధిపత్యాన్ని మళ్లీ తెలంగాణ ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దేందుకు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం ఒక్కటే కాదు, సంస్కృతి ఆధిపత్య వ్యతిరేక పోరాటం కూడా..తెలంగాణలో ట్యాంక్ బండ్ సహా తెలంగాణ వ్యాప్తంగా సీమాంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారి ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దారు..ఈ విగ్రహాధిపత్య సంస్కృతికి వ్యతిరేకత కూడా ఉద్యమంలో కీలక భాగస్వామ్యమైంది. సీమాంధ్రుల విగ్రహాలు తొలగించి తెలంగాణ కవులు ,కళాకారులు, ఉద్యమకారులు, ముఖ్యమైన రాజకీయ నాయకులు విగ్రహాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కీలకమైంది. ఈ డిమాండ్ లోంచి పుట్టిందే ట్యాంక్ బండ్ పై సీమాంధ్రుల విగ్రహాల ధ్వంసం.
తాజాగా తెలంగాణలో మళ్లీ సీమాంధ్రుల విగ్రహాలు విరివిరిగా వెలుస్తున్నాయి. కాంగ్రెస్ అసమర్థతో మళ్లీ తెలంగాణపై సమైక్యవాదుల విగ్రహాలను బలవంతంగా రుద్దుతున్నారు. ఒకవైపు తెలంగాణ వాళ్ల విగ్రహాలు పెట్టకుండా, తెలంగాణ భాషా యాస, సంస్కృతిక, విప్లవ, ప్రజా చైనత్య గీతాలు రాసిన పాడిన కళకారుల విగ్రహాలు తెలంగాణ గడ్డపై పెట్టకుండా మళ్లీ తెలంగాణకు ద్రోహం చేసినా, తెలంగాణను అడుగడుగా దగా, మోసం చేసినా, తెలంగాణ యాసను భాషాను, చివరికి కళాకారులను కించపర్చిన వాళ్ల విగ్రహాలు మళ్లీ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టిస్తుంది.
తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకరించిన వ్యక్తి, ఉద్యమాన్ని కఠినంగా అణిచివేసిన రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించారు..తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు వ్యతిరేకించిన అధికార బలంతో కుల బలంతో తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా సమైక్యవాది, తెలంగాణను అసెంబ్లీలో అవమానించిన రోశయ్య విగ్రహాన్ని పెట్టారు..రోశయ్య విగ్రహం పెట్టడం తెలంగాణ అవమానించడం.తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమ కారుల త్యాగాలను కించర్చపర్చడమే అని తెలంగాణ సమాజం నెత్తినోరు మొత్తుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు..వెరిసి రోశయ్య విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
తాజాగా ఇప్పుడు హైదరాబాద్ రవీంద్ర భారతి లో పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టేందుకు సిద్దమైంది..సినిమా రంగంలో తెలంగాణ కళకారులను తొక్కిన వ్యక్తుల్లో బాల సుబ్రహ్మణ్యం ఒకరు..ఆయన చాలా గొప్ప గొప్ప పాటలు పాడవచ్చు..లక్షల మంది అభిమానులు సంపాదించుకోవచ్చు..కానీ తెలంగాణపై అయనకు వ్యతిరేక భావన ఉంది. అంతేకాదు ఎన్ని కోట్లు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడనని తెలంగాణను అవమానించిన బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఎలా పెడుతుంది.
తెలంగాణలో బాల సుబ్రహ్మణ్యాన్ని మించిన ప్రజా సింగర్స్ ఉన్నారు..గద్దరన్న, గూడ అంజయ్య వంటి ప్రజలు చైతన్యపర్చిన ప్రజావాగ్గేయకారులు ఉన్నారు. బెల్లి లలిత వంటి మహిళ కళాకాణిలున్నారు.. వీరంత తెలంగాణ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు.పాశవిక హత్యకు గురై ఏకంగా ప్రాణాలు త్యాగం చేసిన బెల్లి లలితక్కలాంటి వాళ్లున్నారు. పాట కోసం దేహంలో తుటాలు మోశారు. తెలంగాణ గడ్డపై పుట్టారు.. చివరి వరకు తెలంగాణ కోసం నిలబడ్డారు.. పెడితే రవీంద్ర భారతీలో వారందరి విగ్రహాలు పెట్టాలి.. అంతేకానీ స్వరాన్ని అమ్ముకుని సోమ్ము చేసుకుని తెలంగాణ రాష్ట్రగీతాన్ని పాడనని చెప్పిన తెలంగాణ వ్యతిరేకి విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ బిడ్డలను అవమానించడమే అవుతుంది..అంతేకాదు మళ్లీ సీమాంధ్రుల విగ్రహ పెత్తనం మళ్లీ తెలంగాణ బిడ్డలపై రుద్దడమే అవుతుంది.
తెలంగాణలో ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా సీమాంధ్ర టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వమా అని తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. బాలు ఏమైనా తెలుగులోనే పాటులు పాడిండా.. అందులో తెలంగాణ పాటలేమైన పాడిండా. లేదు కదా దేశ వ్యాప్తంగా అనేక భాషాల్లో పాటు పాడాడు. పుట్టిన ఆంధ్రలో అమరావతిలో , అంత్యక్రియలు చేసుకున్న తమిళనాడులో విగ్రహం పెట్టకుండా తెలంగాణలో విగ్రహం పెట్టాలను కోవడం ఏంటీ..?. ఇది తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం కాదా..?. అడగ్గనే రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టడానికి అనుమతి ఇచ్చి ప్రభుత్వం దగ్గరుండి ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కనీసం సోయి లేకుండా పోయింది.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నిసిగ్గుగా రవీంద్ర భారతిలో బాల సుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేముందంటుంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు.. సీమాంధ్ర ఏజెంట్స్ పవర్ లో ఉన్నట్లు కాంగ్రెస్ మాటలను బట్టి స్పష్టం అవుతుంది..తెలంగాణ వచ్చిన తర్వాత టీ కాంగ్రెస్ అని పేరు మార్చుకున్న ఇంకా కాంగ్రెస్ నేతల బానిస బుద్ధి పోలేదు.. సీమాంధ్ర నేతల ఆలోచనలను నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు బయటపడలేకపోతున్నారు. ఏ విగ్రహమైన తానంటతాను ఒంటరిగా రాదు.. అది చూడటానికి నిర్జీవ, అచలనంగా ఉన్నా దాని ప్రభావం సమాజం పై చాలా ఉంటుంది .. చాలా మందిని ప్రభావితం చేస్తుంది..అంతేకాదు విగ్రహంతో పాటు దాని సంస్కృతి వస్తుంది.. విగ్రహం వెనుక ఉన్న సంప్రదాయాలు, ఆధిపత్యాలు వస్తాయి.. ఆరు దశాబ్దాలు తెలంగాణ నిండా ఆంధ్ర వాళ్ల విగ్రహాలు పెట్టి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కవులు. కళాకారులపై ఆధిపత్యం చలాయించింది కదా.. ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలియదా..?
తెలంగాణ వ్యతిరేకి, సీమాంధ్రకు చెందిన బాలు విగ్రహం రవీంద్ర భారతీలో పెట్టడమంటే తెలంగాణ కళాకారుల పై మళ్లీ సీమాంధ్రుల ఆధిపత్యం తీసుకురావడం కాదా..? తెలంగాణ ఉద్యమంలో ఏ సీమాంధ్ర విగ్రహాధిపత్యాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించిందో ఇప్పుడు రోశయ్య, బాల సుబ్రహ్మణ్యం వంటి తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలు అధికారికంగా పెట్టడమంటే అది తెలంగాణ ఆత్మను, అస్థిత్వాన్ని దెబ్బదీయడే అవుతుంది.తెలంగాణ ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానించడమే అవుతుంది. తెలంగాణ ఆత్మను చంపడమే అవుతుంది..!
-తోటకూర రమేష్





