చిన్నారిని లాలించి తల్లి ప్రేమను పంచిన కానిస్టేబుల్‌

గ్రూప్‌ 3 ఎగ్జామ్‌ ‌రాసేందుకు వొచ్చిన బాలింతకు సహాయం
మహిళా కానిస్టేబుల్‌ ‌మాతృహృదయానికి పలువురు ప్రశంసలు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌గ్రూప్‌ -3 ‌పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు పరీక్షా కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ ‌సాయం అందించి అందరి చేత  ప్రశంసలు అందుకుంది. తల్లి పరీక్ష రాసేందుకు వెళ్లగా ఆరు నెలల బాబును అక్కున చేర్చుకొని పరీక్ష సమయం ముగిసే వరకు బాబును ఎత్తుకొని ఆడించింది. ఈ సంఘటన వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని శేర్లింగంపల్లికి చెందిన కృష్ణవేణి  గ్రూప్‌ -3 ‌పరీక్ష రాసేందుకు  తాండూరు పట్టణం సింధూ జూనియర్‌ ‌కాలేజిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి బాబుతో కలిసి వచ్చింది.

కేంద్రంలోకి బాబు అనుమతి లేకపోవడంతో కేంద్రం వద్ద వీధుల్లో ఉన్న బషీరాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మహిళా కానిస్టేబుల్‌ ‌నర్సమ్మ బాబును తీసుకుంది. తల్లి పరీక్ష రాసి వచ్చేంతవరకు బాబును జాగ్రత్తగా చూసుకొని ఎడవకుండా జో కొడుతూనే.. మరోవైపు బందోబస్తు విధులు నిర్వర్తించింది. పరీక్షా కేంద్రంను తనిఖీ చేసేందుకు వచ్చిన సబ్‌ ‌కలెక్టర్‌ ఈ ‌దృశ్యాన్ని చూసి అభినందించారు. తోటి ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులు, మహిళా కానిస్టేబుల్‌ ‌చేసిన సాయానికి   శభాష్‌.. అం‌టూ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *